News July 6, 2024
వారిద్దరూ నా ఫేవరెట్ ప్లేయర్లు: గిల్

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ ప్లేయర్లని యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్ అన్నారు. భారత క్రికెట్‌లో వారిద్దరూ లెజెండ్స్ అని కొనియాడారు. వారు సాధించిన ఘనతలను అందుకోవడం కష్టంతో కూడుకున్నదని మీడియా సమావేశంలో చెప్పారు. ప్రతి ఆటగాడికి ప్రత్యేక గోల్స్ ఉంటాయనీ అయితే ఒత్తిడిని జయిస్తేనే అవి సాధ్యమవుతాయని అన్నారు. జింబాబ్వేతో నేటి నుంచి జరిగే T20 సిరీస్‌కు గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News January 12, 2026
వారాన్ని బట్టి పందెం పుంజులను బరిలో దింపుతారు

కుక్కుట శాస్త్రం ప్రకారం నక్షత్రాలను బట్టి అనుకూల రంగులున్న కోళ్లను బరిలోకి దింపుతారట. పందెం కట్టేవాళ్లు ఇంటికి బరి ఏ దిక్కున ఉందో చూసుకోవడంతో పాటు పేరులో తొలి అక్షరాన్ని బట్టి దిక్కును నిర్ణయించుకుంటారట. ఆది, శుక్రవారం అయితే ఉత్తర దిశ నుంచి.. సోమ, శనివారం అయితే దక్షిణ దిశ నుంచి.. మంగళవారం తూర్పు దిశ నుంచి బుధవారం, గురువారం పడమర దిశ నుంచి కోళ్లను బరిలోకి దింపుతారట. వారాన్ని బట్టి ఈ దిశ మారుతుంది.
News January 12, 2026
తగ్గిన చలి.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇవాళ చిత్తూరు, TPT, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, NLR, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA పేర్కొంది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో మన్యం జిల్లాల్లో చలి తీవ్రత తగ్గింది. నిన్న జి.మాడుగులలో 12.6 డిగ్రీలు, అరకులో 13.5, చింతపల్లిలో 14.2 డిగ్రీలుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టంగా అలుముకున్న పొగమంచు కూడా తగ్గింది.
News January 12, 2026
జంతికలు కరకరలాడుతూ రావాలంటే?

జంతికలు కరకరలాడాలంటే కప్పు బియ్యప్పిండికి రెండు కప్పుల సెనగపిండి తీసుకుని గోరువెచ్చని నీళ్లతో కలపాలి. పిండిలో వాము, వెన్న వేయాలి. గట్టిగా, మరీ జారుగా కాకుండా కలపాలి. అలాగే ముద్ద కలిపిన తర్వాత తడి వస్త్రంతో పైన కప్పేయాలి. 15 నిమిషాల తర్వాతే ఆ పిండిని వాడాలి. అలాగే వేయించేటప్పుడు జంతికలని ఎక్కువ సేపు నూనెలో ఉంచొద్దు. అలా ఉంచితే జంతికలు గట్టిగా ఉంటాయి. రంగుమారగానే జంతికల్ని బయటకు తీసేయాలి.


