News July 6, 2024
సూర్యాపేట: బైక్ డివైడర్‌ను ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎర్ర పహాడ్ స్టేజి సమీపంలో 365వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. పెదనేమిలకి చెందిన తన్నీరు సత్తయ్య మృతి చెందాడు. బైక్‌పై సూర్యాపేట నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో నిద్రమత్తులో డివైడర్‌ని ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సత్తయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 14, 2026
మిర్యాలగూడ: వాగులో పడి రైతు మృతి

మిర్యాలగూడ మండలం తడకమళ్లకి చెందిన అనంతుల లింగయ్య పొలానికి వెళ్లే సమయంలో పాలేరు వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా వాగులో మృతదేహం లభ్యమైంది. మృతుని కుమారుడు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై లక్ష్మయ్య తెలిపారు.
News March 14, 2026
పుకార్లు నమ్మొద్దు.. మోసపోవద్దు: నల్గొండ కలెక్టర్

జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాకు సంబంధించి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని నల్గొండ కలెక్టర్ స్పష్టం చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ దొరకదనే పుకార్లను నమ్మి అధిక ధరలకు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. జిల్లాలోని 33 ఏజెన్సీల ద్వారా బుకింగ్ చేసిన 4 నుంచి 5 రోజుల్లోపు సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ఏజెన్సీల వద్ద 8118 సిలిండర్ల నిల్వలు ఉన్నాయని తెలిపారు.
News March 13, 2026
వాడపల్లి కేసులో వివరణ కోరిన మానవ హక్కుల సంఘం

వాడపల్లి పోలీసుల కస్టడీలో గిరిజన యువకుడు సాయి సిద్ధుపై జరిగిన చిత్రహింసల ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. బాధితుడికి రూ.50 వేల నష్టపరిహారం ఎందుకు చెల్లించకూడదో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయాన్ని హైకోర్టు న్యాయవాది రేవంత్ వెల్లడించారు.


