News July 6, 2024
BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 పెరిగి రూ.67,650కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 పెరగడంతో రూ.73,800 పలుకుతోంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,600 పెరిగి రూ.99,300కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపుగా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
Similar News
News April 8, 2026
ఇది యుద్ధానికి ముగింపు కాదు: మొజ్తబా ఖమేనీ

సీజ్‌ఫైర్‌కు <<19594824>>అంగీకరించిన<<>> నేపథ్యంలో కాల్పులు ఆపాలని మిలిటరీ యూనిట్లకు ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ఆదేశాలిచ్చారు. అయితే ఇది యుద్ధానికి ముగింపు కాదని స్పష్టంచేశారు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఇదే విషయం స్పష్టం చేసింది. ‘సీజ్‌ఫైర్ అగ్రిమెంట్ చేసుకున్నామంటే దానర్థం యుద్ధం ముగిసినట్లు కాదు. మా చేతులు ట్రిగ్గర్‌పైనే ఉంటాయి. చిన్న తప్పు చేసినా విరుచుకుపడతాం’ అని హెచ్చరించింది.
News April 8, 2026
EAPCET అభ్యర్థులకు అలర్ట్.. ఎడిట్ ఆప్షన్‌కు నేడే లాస్ట్ డేట్!

TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల కోసం రాసే EAPCET అప్లికేషన్లలో తప్పులుంటే సరిచేసుకోవడానికి ఇచ్చిన టైమ్ ఇవాళ్టితో ముగియనుంది. చాలా మంది అప్లికేషన్లలో తప్పులు రావడంతో అధికారులు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. పేరు, పుట్టిన తేదీ, ఇంటర్ హాల్‌టికెట్ నంబర్ వంటివి ఆన్‌లైన్‌లో మారవు. అందుకే వీటి కోసం స్టూడెంట్స్ హైదరాబాద్‌లోని JNTUకి క్యూ కడుతున్నారు. మిగతా వివరాలను మాత్రం ఆన్‌లైన్‌లోనే వెంటనే మార్చుకోవచ్చు.
News April 8, 2026
ముంచుకొస్తున్న కరవు.. 2027 వరకు గడ్డుకాలమే!

పసిఫిక్ సముద్రం వేడెక్కుతోంది. రాబోయేది మామూలు ఎల్ నినో కాదు. ఏకంగా ‘సూపర్ ఎల్ నినో’ అని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల 2027 వరకు ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతాయి. ఇండియాలో వర్షాలు కురవక సాగు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దక్షిణ అమెరికాలో భారీ వరదలు, ఆసియాలో కరవు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వాతావరణం అల్లకల్లోలంగా మారనుంది. దీనికి ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.


