News July 6, 2024

అథ్లెట్లకు CM చంద్రబాబు అభినందనలు

image

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అథ్లెట్లు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధి ఏవీ రాఘవేంద్ర పేర్కొన్నారు. పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో వై జ్యోతి, జ్యోతిక శ్రీలు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. వీరిని నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ ఉన్నారు.

Similar News

News March 18, 2026

పామర్రు: ‘పది’ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

పామర్రు జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ డీకే బాలాజీ తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నాయని కలెక్టర్ చెప్పారు.

News March 18, 2026

కృష్ణా: గ్యాస్ సరఫరాలో సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

ఎల్‌పీజీ గ్యాస్ సిలెండర్ల సరఫరాలో నెలకొన్న ఇబ్బందుల దృష్ట్యా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గ్యాస్ సరఫరాలో ఎటువంటి సమస్యలున్నా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08672-242493కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ప్రతి రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని చెప్పారు.

News March 18, 2026

రేపు మచిలీపట్నంలో జిల్లా స్థాయి ఉగాది వేడుకలు

image

తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను ఈ నెల 19వ తేదీన మచిలీపట్నంలోని బచ్చుపేట వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించనున్నారన్నారు. ఈ వేడుకలకు ఇన్‌ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ తోపాటు మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర ప్రజాప్రతినిథులు పాల్గొంటారన్నారు.