News July 6, 2024
KNR: త్వరలో కొత్త రేషన్ కార్డులు!

కొత్త రేషన్ కార్డులు జారీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. త్వరలో కొత్త కార్డులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఆశావహుల్లో హర్షం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మీ-సేవ పోర్టల్ ఓపెన్ చేసి కొత్త దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి.
Similar News
News March 2, 2026
హోలీ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ

హోలీ పండగను ప్రజలు శాంతియుతంగా, సోదరభావంతో జరుపుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. బలవంతంగా రంగులు పూసినా, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల భద్రత కోసం షీ-టీమ్స్ నిఘా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. అత్యవసరమైతే ‘డయల్ 100’కు కాల్ చేయాలని తెలిపారు.
News March 2, 2026
KNR: ‘ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు’

సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లో ఉంచొద్దని అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం 345 దరఖాస్తులు వచ్చాయి.
News March 1, 2026
KNR: ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్షకు 311 మంది హాజరు

కరీంనగర్ లోని వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఎస్సీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్షకు 311 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఎం.నాగైలేశ్వర్ తెలిపారు. ఫలితాలను హైదరాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్ వెబ్‌సైట్‌లో వెల్లడిస్తారని, ఎంపికైన వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామన్నారు. ఇతర వివరాలకు ఎస్సీ స్టడీ సర్కిల్లో సంప్రదించాలన్నారు.


