News July 6, 2024
100 అడుగుల ధోనీ కటౌట్
అభిమాన ప్లేయర్ల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఫ్యాన్స్ వెనకడుగు వేయట్లేదు. రేపు మాజీ క్రికెటర్ ధోనీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏపీలోని నందిగామలో ఫ్యాన్స్ 100 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. మిస్టర్ కూల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొని ఐదేళ్లు గడుస్తున్నా ఆయనపై అభిమానం ఏ మాత్రం తగ్గలేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Similar News
News January 16, 2025
KTR.. ‘గ్రీన్ కో’ను ఎందుకు కాపాడుతున్నావ్: సామ
ఫార్ములా కేసులో KTR అవినీతి స్పష్టంగా కన్పిస్తోందని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఆదేశాలతోనే ఫార్ములా-e వారికి HMDA (గ్రీన్ కో తరపున) డబ్బులు చెల్లించినట్టు ఆధారాలు ఉన్నాయన్నారు. నష్టాల వల్లే గ్రీన్ కో తప్పుకుందన్న KTR.. ఫార్ములా-eకి మొదటి సీజన్ డబ్బు కట్టలేదనే విషయం మాత్రం ఎందుకు దాచారని ప్రశ్నించారు. గ్రీన్ కో’ను ఎందుకు కాపాడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
News January 16, 2025
ఎల్లుండి 2 జిల్లాల్లో సీఎం పర్యటన
AP: సీఎం చంద్రబాబు ఎల్లుండి రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. శనివారం ఉదయం గుంటూరులో <<15157199>>వాట్సాప్ గవర్నెన్స్ సేవలను<<>>, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం వైఎస్సార్ జిల్లాలో నిర్వహించే స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని ఉండవల్లికి తిరిగెళ్తారు. సాయంత్రం తన నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు డిన్నర్ ఇవ్వనున్నారు. సీఎం 19న దావోస్ పర్యటనకు బయలుదేరుతారు.
News January 16, 2025
కేటీఆర్‌పై ఈడీ ప్రశ్నల వర్షం
TG: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ కొనసాగుతోంది. సుమారు 4 గంటలుగా ఆయనపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. HMDA ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఆరా తీస్తున్నారు. అర్వింద్ కుమార్, BLN రెడ్డి వాంగ్మూలాల ఆధారంగా KTRను క్వశ్చన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా మాజీ మంత్రి చెప్పినట్లే తాము చేశామని ఇటీవల ఈడీ విచారణకు హాజరైన అర్వింద్, రెడ్డి చెప్పినట్లు సమాచారం.