News July 6, 2024
మసూద్ గెలుపుతో టెన్షన్స్ తగ్గుతాయా?

ఇజ్రాయెల్‌పై పోరులో హమాస్‌కు మద్దతు, USతో సంబంధాలు క్షీణించిన వేళ ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో <<13575769>>మసూద్<<>> పెజెష్కియన్ గెలుపొందడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వంలో ఇస్లామిస్ట్ వాదుల మెజార్టీ, సుప్రీంలీడర్‌గా ఆయతొల్లా ఖోమైనీ ఉండటం వంటి సవాళ్లను ఎదుర్కొంటూ మసూద్ పాలన సాగించాలి. సంస్కరణవాది అయిన మసూద్ హిజాబ్‌పై చట్టాల సడలింపు సహా అంతర్జాతీయ పాలసీల్లో మార్పు తెస్తారని ఆయన మద్దతుదారులు ఆశిస్తున్నారు.
Similar News
News July 6, 2025
రాష్ట్రంలో ఊపందుకున్న బర్లీ పొగాకు కొనుగోళ్లు

AP: రాష్ట్రవ్యాప్తంగా HD బర్లీ పొగాకు కొనుగోళ్లు జరుగుతున్నాయని మార్క్‌ఫెడ్ ఎండీ ఢిల్లీరావు తెలిపారు. ఇంకొల్లు, పంగులూరు, పర్చూరు, బీకేపాలెం, చీరాల, గుంటూరు, పెదకాకాని, చిలకలూరిపేట, ఎడ్లపాడు, గుండ్లపల్లి కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయని చెప్పారు. రూ17.20 కోట్ల విలువైన 2245 బేళ్ల పొగాకు విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. రైతులకు డిజిటల్ చెల్లింపులు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
News July 6, 2025
వర్షంలో తడుస్తున్నారా?

కొందరు వర్షంలో తడుసుకుంటూ ఇంటికి వచ్చి యథావిధిగా పనులు చేసుకుంటుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తడిసిన వెంటనే దుస్తులు మార్చుకుంటే శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది. దీనివల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ కారకాల నుంచి తప్పించుకోవచ్చు. శరీరంపై యాంటీ బాక్టీరియల్ క్రీమ్ రాసుకోవాలి. టీ లేదా కషాయాలు తాగాలి. ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
News July 6, 2025
శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

AP: శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేశుల నుంచి 1.86 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 67వేల క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు నుంచి 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 879.30 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు ప్రస్తుతం 180.42 TMCలుగా ఉంది. 2 రోజుల్లో గేట్లు ఎత్తే ఛాన్స్ ఉంది.