News July 6, 2024

దూకుడుగా ‘ఆపరేషన్ ఆకర్ష్‌’.. కాంగ్రెస్‌లోకి మరో నలుగురు ఎమ్మెల్యేలు?

image

TG: ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్‌’లో దూకుడు పెంచింది. దీంతో ఆ పార్టీలోకి BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా గద్వాల MLA హస్తం కండువా కప్పుకున్నారు. ఇక BRSకు చెందిన మరో 4 ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వారెవరనేది ఆసక్తిగా మారింది. మరోవైపు వెళ్లేవారితో పార్టీకి నష్టమేమీ లేదంటున్న KCR.. వలసలు ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

Similar News

News November 16, 2025

ఫేస్ క్రీమ్ వాడుతున్నారా?

image

కొన్ని క్రీములను కలిపి రాయడం వల్ల అదనపు ప్రయోజనాలుంటాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..ముడతలు ఎక్కువగా ఉన్నవారు విటమిన్-సి ఉన్న క్రీములతో పాటు సన్‌స్క్రీన్ లోషన్ కలిపి రాయాలి. చర్మం మృదువుగా ఉండాలంటే రెటినాల్, పెప్టైడ్ క్రీములు ఎంచుకోండి. అయితే రెటినాల్‌ను రాత్రే రాయాలి. హైలురోనిక్ యాసిడ్‌తోపాటు ఏహెచ్ఎ, బీహెచ్ఎ ఉన్నవి ఎంచుకోండి. ఈ సమస్యలన్నీ తగ్గిపోయి చర్మం తాజాగా కనిపిస్తుంది.

News November 16, 2025

నా వర్క్‌కు పర్సనల్ నంబర్ వాడను: అదితీరావు

image

హీరోయిన్ అదితీరావు హైదరీ ఫొటోలను ఉపయోగిస్తూ పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె ఇన్‌స్టాలో ఓ నోట్ రిలీజ్ చేశారు. ‘ఫొటో‌షూట్‌ల పేరుతో ఫొటోగ్రాఫర్లకు దుండగులు వాట్సాప్‌లో నా ఫొటో పెట్టుకొని సంప్రదిస్తున్నారు. నేనెప్పుడూ నా వర్క్‌కు పర్సనల్ నంబర్‌ను వాడను. ఏదైనా నా టీమ్ చూసుకుంటుంది. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి’ అని పేర్కొన్నారు.

News November 16, 2025

సేవింగ్స్ అకౌంట్లో ఈ లిమిట్ దాటితే ఐటీ నిఘా ఖాయం!

image

బ్యాంకు ట్రాన్సాక్షన్ పరిమితులు తెలియకుండా భారీగా లావాదేవీలు చేస్తే IT నిఘా ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక FYలో సేవింగ్స్ ఖాతాలో ₹10 లక్షలు, కరెంట్ ఖాతాలో ₹50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. అంతకుమించితే ITకి రిపోర్ట్ చేయాలి. FD ₹10 లక్షలు, ఒక వ్యక్తి నుంచి నగదు రూపంలో ₹2 లక్షల వరకు మాత్రమే పొందవచ్చు. ప్రాపర్టీ కొనుగోలు టైమ్‌లో ₹30 లక్షలు, క్రెడిట్ కార్డు బిల్లు ₹10 లక్షల పరిమితిని దాటకూడదు.