News July 6, 2024

పులివెందుల చరిత్రలో ఇలాంటి సంప్రదాయం లేదు: జగన్

image

AP: రాష్ట్రంలో చంద్రబాబు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. నిన్న కడప జిల్లా వేంపల్లిలో టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించిన జగన్.. వైసీపీకి ఓటేసిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పులివెందుల చరిత్రలో ఇలాంటి సంప్రదాయం లేదని, శిశుపాలుడి పాపాల మాదిరిగా బాబు పాపాలు పండుతున్నాయని జగన్ విమర్శించారు.

Similar News

News April 10, 2026

IPL: చరిత్ర సృష్టించారు

image

KKRతో మ్యాచ్‌లో LSG ప్లేయర్లు ముకుల్ చౌదరి, అవేశ్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. సక్సెస్‌ఫుల్ <<19611855>>రన్ ఛేజ్‌లో<<>> 8th వికెట్ లేదా అంతకంటే దిగువన అత్యధిక భాగస్వామ్యం(54*) నమోదు చేసిన జోడీగా నిలిచారు. ఇందులో ముకుల్ ఒక్కరే 52 రన్స్ చేశారు. అలాగే లక్ష్య ఛేదనలో ఏడో నంబర్‌/దిగువన బ్యాటింగ్‌కు వచ్చి హయ్యెస్ట్ సిక్సర్లు(7) బాదిన ప్లేయర్‌గా బ్రావో సరసన ముకుల్ చేరారు.

News April 10, 2026

RBI కొత్త ప్రతిపాదన.. రూ.10,000+ పంపిస్తే!

image

ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు RBI కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. ₹10వేలకు మించి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు రిసీవర్ ఖాతాలో ఆ నగదు జమ అయ్యేందుకు ఒక గంట సమయం పట్టేలా రూల్ తేనుంది. ఈలోగా మనీ పంపినవారు వద్దనుకుంటే ఆ బదిలీని రద్దు చేయవచ్చు. బ్యాంకులూ అనుమానాస్పద లావాదేవీలపై అలర్ట్ చేస్తాయి. మర్చంట్, రికరింగ్, చెక్ పేమెంట్స్‌కు ఇది వర్తించదు. దీనిపై మే8 వరకు RBI అభిప్రాయాలు స్వీకరించనుంది.

News April 10, 2026

రోజూ పొద్దున్నే రాగి జావ తాగితే..

image

రాగుల్లో ప్రొటీన్స్, ఐరన్, ఫైబర్, అమైనో అమ్లాలు, విటమిన్ C, కాల్షియం అధికంగా ఉంటాయి. రోజూ పొద్దున్నే రాగి జావ తాగితే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. చర్మానికి నిగారింపు వస్తుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు రోజూ ఈ జావను తీసుకుంటే ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.
#ShareIt