News July 6, 2024
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు భారీ జరిమానా

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు ఆర్బీఐ రూ.1.31 కోట్ల జరిమానా విధించింది. రుణాలు, అడ్వాన్సులకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు కస్టమర్ల చిరునామాలకు సంబంధించిన రికార్డులు భద్రపరచడంలో PNB విఫలమైందని ఓ ప్రకటనలో పేర్కొంది. బ్యాంకు పనితీరుపై 2022 మార్చి 30న తనిఖీలు నిర్వహించగా ఆదేశాలు పాటించని బ్యాంకులకు నోటిసులు జారీ చేసింది. అయితే వాటి వివరణతో సంతృప్తి చెందకపోవడంతో ఫైన్ వేసింది.
Similar News
News November 6, 2025
శుభ సమయం (06-11-2025) గురువారం

✒ తిథి: బహుళ పాడ్యమి సా.4.51 వరకు
✒ నక్షత్రం: భరణి ఉ.8.35 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: మ.1.30-3.00
✒ యమగండం: ఉ.6.00-ఉ.7.30
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-10.48, మ.2.48-3.36
✒ వర్జ్యం: రా.7.49-9.19
✒ అమృత ఘడియలు: ఉ.5.20 నుంచి మొదలు
News November 6, 2025
TODAY HEADLINES

➭ తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
➭ KTR.. రాజీనామాకు సిద్ధంగా ఉండు: CM రేవంత్
➭ 3 ఫీట్ల రేవంత్ 30 ఫీట్లున్నట్టు బిల్డప్ ఇస్తాడు: KTR
➭ APలోని 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ACB తనిఖీలు
➭ కొత్తగా 8 జిల్లాల ఏర్పాటుకు సూచనలు: మంత్రి అనగాని
➭ ఆకాశంలో కనువిందు చేసిన సూపర్ మూన్
➭ PM మోదీతో ఉమెన్స్ WC విన్నింగ్ టీమ్ భేటీ
➭ SA టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. పంత్ రీఎంట్రీ
News November 6, 2025
ప్రభుత్వ వర్సిటీల్లో యూనిఫైడ్ యాక్ట్: లోకేశ్

AP: ఉన్నత విద్య పాఠ్యప్రణాళికను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఉన్నత, ఇంటర్ విద్యపై అధికారులతో ఆయన సమీక్షించారు. ‘ప్రభుత్వ వర్సిటీల్లో పరిపాలనకు సంబంధించి యూనిఫైడ్ యాక్ట్ రూపొందించాలని ఆదేశించాను. ITIలు, వర్సిటీలను NOVలోగా పరిశ్రమలతో అనుసంధానించాలి. విద్యార్థుల 100% క్యాంపస్ సెలక్షన్స్‌కు చర్యలు తీసుకోవాలి. ఇంటర్‌లో ఉత్తీర్ణత పెంపునకు చర్యలు చేపట్టాలి’ అని తెలిపారు.


