News July 6, 2024

TNPL: ఓపెనర్ అవతారం ఎత్తిన అశ్విన్!

image

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఓపెనర్ అవతారం ఎత్తారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అశ్విన్ దుండిగల్ డ్రాగన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. తిరుచ్చి గ్రాండ్ చోళాస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన ఓపెనర్‌గా వచ్చారు. కానీ 5 పరుగులకే ఔటై నిరాశపరిచారు. కాగా ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో అశ్విన్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో యుజ్వేంద్ర చాహల్ ఎంపికయ్యారు.

Similar News

News March 11, 2026

భద్రాచలం: మావోయిస్టులు.. పోలీసులకు మధ్య కాల్పులు

image

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పార్థాపూర్ ప్రాంతంలో బుధవారం భద్రతా బలగాలు, మావోయిస్ట్‌ల మధ్య భీకర ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్ట్‌లు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఎన్‌కౌంటర్ జరిగిన విషయాన్ని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నిఖిల్ రఖేచా ధ్రువీకరించారు. ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సమచారం.

News March 11, 2026

ఆ మందులతో లివర్ డ్యామేజీ: అధ్యయనం

image

ఆయుర్వేదం, ఇతర ప్రత్యామ్నాయ మందుల వాడకంపై తాజా అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడించింది. 386 రకాల ఉత్పత్తులను పరీక్షించగా 27.7% మందుల్లో స్టెరాయిడ్స్, 31.3% ఉత్పత్తుల్లో జంతు సంబంధిత వ్యర్థాలు ఉన్నట్లు ఇందులో తేలినట్లు ‘ఫ్రాంటియర్స్ ఇన్ గ్యాస్ట్రోఎంటరాలజీ’ ప్రచురించింది. వీటిలో సీసం, ఆర్సెనిక్ వంటి భార లోహాలు మోతాదుకు మించి ఉన్నాయని, వీటివల్ల 39% మందిలో కాలేయం పాడై మరణ ముప్పు పెరుగుతుందని తెలిపింది.

News March 11, 2026

ట్రంప్ రిఫైనరీ ప్రాజెక్టుకు రిలయన్సే ఎందుకు?

image

టెక్సాస్ రిఫైనరీ ప్రాజెక్టులో <<19350969>>రిలయన్స్‌<<>>ను పార్ట్‌నర్‌గా చేర్చుకోవడానికి కారణం దాని ‘నెల్సన్ కాంప్లెక్సిటీ ఇండెక్స్’ (NCI). ప్రపంచంలో అధిక NCI (21.1) ఉన్న రిఫైనరీ జామ్‌నగర్. అంటే ఇది చౌకగా లభించే భారీ ముడి చమురును సైతం అత్యంత నాణ్యమైన ఇంధనంగా మార్చగలదు. ఈ స్థాయి సామర్థ్యం వరల్డ్‌లో మరే రిఫైనరీకి లేదు. వెనిజులా నుంచి వచ్చే చమురును శుద్ధి చేయడానికి రిలయన్స్ వంటి కాంప్లెక్స్ రిఫైనరీ అవసరం.