News July 6, 2024
భారత్‌లోనే అతి తక్కువ టారిఫ్ ధరలు: కేంద్రం

దేశంలో జియో, ఎయిర్‌టెల్, VI కంపెనీలు మొబైల్ <<13524115>>టారిఫ్‌ల<<>>ను ఒక్కసారిగా పెంచినా కేంద్రం నియంత్రణ, పర్యవేక్షణ కొరవడిందంటూ కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఈక్రమంలో దీనిపై కేంద్ర కమ్యూనికేషన్ మినిస్ట్రీ వివరణ ఇచ్చింది. వివిధ దేశాల టారిఫ్ ధరలను పోల్చుతూ ఇండియాలోనే చాలా తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఇండియాలో సగటున $1.89 టారిఫ్‌తో నెలపాటు అపరిమిత కాల్స్, 18GB డేటా వస్తుందని తెలిపింది.
Similar News
News March 17, 2026
వంటింటి చిట్కాలు

* నిమ్మజాతి పండ్లు, టమాటాలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
* వంటింట్లో వాడే స్పాంజీలూ, మసి బట్టల్ని ఉప్పు వేసిన చల్లని నీళ్లలో కాసేపు నానబెట్టి తరువాత ఉతకండి. క్రిములు పోతాయి. దుర్వాసన కూడా ఉండదు.
* పాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపితే పాత్రలు నీచు వాసన రావు.
* తేనె ముద్దగా అయితే, కాసేపు అది ఉన్న సీసాను వేడి నీళ్లలో ఉంచితే సరిపోతుంది.
News March 17, 2026
ఒత్తిడి పెరిగితే.. అందం తగ్గిపోతుంది

ఒత్తిడికి ఎక్కువగా గురయ్యే మహిళలు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ సైన్స్ అండ్ రీసర్చ్ ప్రచురించిన నివేదికలో పేర్కొన్నారు. ఒత్తిడి వల్ల వృద్ధాప్య ఛాయలు ముందే రావడంతో పాటు నెలసరి సమస్యలు, బీపీ, షుగర్ వంటివి దాడి చేస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి సరిపడా నీరు, నిద్ర, పోషకాలున్న ఆహారం, వ్యాయామాలు, ధ్యానం ఉపయోగపడతాయని చెబుతున్నారు.
News March 17, 2026
ప్రెగ్నెన్సీలో కాళ్ల వాపు ఎందుకు వస్తుంది?

ప్రెగ్నెన్సీలో కాళ్లవాపులు రావడాన్ని వైద్య పరిభాషలో జెస్టెషనల్ ఎడిమా అంటారు. గర్భిణిలలో ఏడో నెల నుంచి కాళ్లవాపు సాధారణంగా కనిపిస్తుంది. గర్భసంచి, బేబీ బరువుతో కొన్నిసార్లు కాళ్లవాపు వస్తుంది. గర్భిణుల్లో రక్త హీనత ఉన్నా, రక్తపోటు పెరిగినప్పుడు కాళ్లలో వాపు వస్తుంది. ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకున్నపుడు కూడా కొన్నిసార్లు కాళ్లవాపు కనిపిస్తుంది. సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.


