News July 6, 2024
రెండు రాష్ట్రాల పునరేకీకరణే ఏకైక మార్గమా?: పేర్ని నాని

AP: న్యూస్ ఛానళ్ల బ్రేకింగ్ వార్తలు.. రేవంత్, చంద్రబాబు డిమాండ్లు చూస్తుంటే రెండు రాష్ట్రాల పునరేకీకరణే ఏకైక మార్గంగా కనిపిస్తోందని వైసీపీ నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఇద్దరు సీఎంల తీరు చూస్తుంటే విడ్డూరంగా ఉందని ట్వీట్ చేశారు. కాగా మరికాసేపట్లో రేవంత్, చంద్రబాబు ప్రజాభవన్‌లో భేటీ కానున్నారు. విభజన సమస్యలపై వీరిద్దరూ చర్చించనున్నారు.
Similar News
News April 4, 2026
ధురంధర్: హీరోయిన్ కోసం 1,200 మందికి ఆడిషన్!

‘ధురంధర్’ మూవీలో హీరోయిన్‌గా సారా అర్జున్‌ను ఎంపిక చేయడానికి గల కారణాన్ని క్యాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ ఛబ్రా తాజాగా వెల్లడించారు. ‘రణ్‌వీర్‌తో నటించాలని అనుకుంటున్నట్లు చాలామంది ఆదిత్య ధర్, నాకు మెసేజ్‌లు పంపారు. అయితే అక్కడి(పాక్) వ్యక్తిలా కనిపించే, కొత్త ముఖం కావాలని భావించాం. ఇప్పటికే రణ్‌వీర్‌తో నటించిన వాళ్లు సరిపోరు. 1,200-1,300 మందికి ఆడిషన్ చేసి చివరికి సారాను ఎంపిక చేశాం’ అని తెలిపారు.
News April 4, 2026
ఇరాన్ నుంచి స్థిరంగా ఆయిల్ సరఫరా: ఇండియా

పశ్చిమాసియాలో అంతరాయాలు ఎదురవుతున్నప్పటికీ దేశీయ రిఫైనరీలు స్థిరంగా క్రూడాయిల్ పొందుతున్నాయని పెట్రోలియం శాఖ తెలిపింది. ఇరాన్ సహా పలు దేశాల నుంచి సరఫరా కొనసాగుతోందని ట్వీట్ చేసింది. దిగుమతులకు సంబంధించి చెల్లింపులకు అడ్డంకి లేదని స్పష్టం చేసింది. పేమెంట్ సమస్యల వల్ల ఇండియాకు రావాల్సిన ఆయిల్ ట్యాంకర్ చైనాకు వెళ్లిందన్న వార్తలను ఖండించింది. నౌకలు కొన్నిసార్లు గమ్యస్థానాలను మార్చుకుంటాయంది.
News April 4, 2026
ఆలయాల వద్ద రాజకీయ కార్యకలాపాలపై నిషేధం: CM

TTD తరహాలో తెలంగాణలోని ఆలయాల వద్ద రాజకీయ కార్యకలాపాలను నిషేధించాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. ఆలయాల పవిత్రతకు భంగం కలగకుండా రూల్స్ కఠినం చేయాలన్నారు. ₹225CRతో బాసర ఆలయ అభివృద్ధి ప్రణాళికను CM సమీక్షించారు. ‘భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్ర ప్రకారం అభివృద్ధి చేయాలి. విశాలమైన రోడ్లు ఉండాలి. EVలను వినియోగించాలి’ అని సూచించారు. ఈనెల 6న ఈ పనులకు CM శంకుస్థాపన చేస్తారు.


