News July 6, 2024
పాతబస్తీలో అమిత్ షాపై కేసు ఎందుకు నమోదైంది?

TG: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మే 1న HYD BJP ఎంపీ అభ్యర్థి మాధవీలత తరఫున కేంద్రమంత్రి అమిత్ షా పాతబస్తీలో ప్రచారం చేశారు. ఆ సమయంలో ఇద్దరు బాలికలు చేతిలో BJP జెండాలతో ఆయన వద్దకు వచ్చారు. దీంతో ప్రచారంలో పిల్లల్ని ప్రోత్సహించి, కోడ్ ఉల్లంఘించారన్న ఫిర్యాదుతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘన జరగలేదని తాజాగా మొఘల్పురా పోలీసులు కేసును ఉపసంహరించుకున్నారు.
Similar News
News July 9, 2025
2025 ఫస్టాఫ్ టాప్-10 మూవీస్ ఇవే!

2025 ఫస్టాఫ్ టాప్-10 మూవీస్ జాబితాను IMDb విడుదల చేసింది. ఇందులో విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఛావా’ మూవీ టాప్ ప్లేస్ దక్కించుకుంది. రెండు, మూడు స్థానాల్లో డ్రాగన్, దేవా సినిమాలు నిలిచాయి. ఆ తర్వాత రైడ్ 2, రెట్రో, ద డిప్లొమాట్, ఎంపురన్, సితారే జమీన్ పర్, కేసరి చాప్టర్ 2, విదాముయర్చి చిత్రాలు ఉన్నాయి. కాగా టాలీవుడ్ నుంచి ఒక్క మూవీ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోకపోవడం గమనార్హం.
News July 9, 2025
HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ అరెస్ట్ చేసింది. ఐపీఎల్ మ్యాచుల సందర్భంగా అదనంగా మరో 10శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని SRH యాజమాన్యాన్ని బెదిరించినట్లు ఆయనపై అభియోగాలున్నాయి. ఈ వ్యవహారంలో విజిలెన్స్ <<16524630>>రిపోర్టు<<>> ఆధారంగా ఆయనతో పాటు పాలకవర్గం సభ్యులను సీఐడీ అదుపులోకి తీసుకుంది.
News July 9, 2025
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

TG: తమ రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని సీఎం రేవంత్ ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై కేంద్ర ఎరువులశాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ‘తెలంగాణలో యూరియా కొరత లేకుండా చేస్తాం. ఇప్పటికే ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. అన్ని జిల్లాలకు యూరియాను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో కాస్త యూరియా వాడకం తగ్గిస్తే భూసారం దెబ్బతినకుండా ఉంటుంది’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.