News July 6, 2024
శ్రీసత్యసాయి: రైలు కింద పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

రైలు కిందపడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. నల్లమాడ మండలం ఎర్రవంకపల్లికి చెందిన ప్రభాకర్ కుమారుడు వినోద్ కుమార్(26) సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ముదిగుబ్బ మండలంలోని మలకవేముల క్రాస్ రైల్వేగేట్ సమీపాన రైలు కిందపడి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న కదిరి రైల్వే ఎస్సై రహీం ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 15, 2026
1100 సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో ప్రజలు అర్జీలు నమోదు చేసుకొని, తమ సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు. రెవెన్యూ పరిధిలోని అన్ని ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాలలో మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1100 అనే బ్యానర్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News March 15, 2026
అనంతపురం జిల్లాలో స్వల్పంగా పెరిగిన చికెన్ ధరలు

అనంతపురం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తిలో కేజీ చికెన్ రూ.260, స్కిన్ లెస్ రూ.280, అనంతపురంలో రూ.260, స్కిన్ లెస్ రూ.280 గుంతకల్లులో రూ.240, స్కిన్ లెస్ రూ.260కు విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకుడు షఫీ తెలిపారు. కేజీ మటన్ ధరలో రూ.750 ఎలాంటి మార్పు లేదన్నారు. గత వారంతో పోలిస్తే ఈవారం కేజీపై రూ.20 పెరిగినట్లు పేర్కొన్నారు.