News July 6, 2024

దేశానికి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురండి: రాంప్రసాద్ రెడ్డి 

image

పారిస్ ఒలింపిక్స్‌కు రాష్ట్రం నుంచి 7మంది క్రీడాకారులు అర్హత సాధించినట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింధు, సాత్విక్ సాయిరాజ్(బ్యాడ్మింటన్), ధీరజ్ (ఆర్చరీ), జ్యోతి, జ్యోతికశ్రీ(అథ్లెటిక్స్), నారాయణ (పారా రోయింగ్), ఆర్షద్ (పారా సైక్లింగ్)లు ఉన్నారు. వారిని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అభినందించి దేశానికి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తేవాలన్నారు.  

Similar News

News September 15, 2025

కృష్ణా: 13 మంది ఎంపీడీఓలకు పదోన్నతి

image

కృష్ణా జిల్లాలో నలుగురు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, 9 మంది డిప్యూటీ ఎంపీడీఓలకు ఎంపీడీఓలుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన వారికి జడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక పోస్టింగ్ ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ కన్నమ నాయుడు పాల్గొన్నారు.

News September 15, 2025

కృష్ణా: నేడు బాధ్యతలు స్వీకరించనున్న నూతన SP

image

కృష్ణా జిల్లా ఎస్పీగా నియమితులైన విద్యాసాగర్ నాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11:30 గంటలకు ఆయన జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని పదవీ బాధ్యతలు చేపడతారు. ఇటీవల జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న విద్యాసాగర్ నాయుడును కృష్ణా జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

News September 15, 2025

MTM: ఎస్పీ గంగాధరరావుకు ఘన వీడ్కోలు

image

కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసి బదిలీపై వెళ్తున్న ఆర్. గంగాధరరావు ఐపీఎస్‌కు పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. మచిలీపట్నం గోల్డ్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఎస్పీతో తమ అనుభవాలను పంచుకున్నారు. తమకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి గంగాధరరావు కృతజ్ఞతలు తెలిపారు.