News July 6, 2024
PHOTO GALLERY: చంద్రబాబు, రేవంత్ భేటీ

తెలుగు రాష్ట్రాల సీఎంలు విభజన అంశాలపై చర్చిస్తున్నారు. హైదరాబాద్ ‘ప్రజాభవన్’లో వీరి భేటీ కొనసాగుతోంది. ఏపీ తరఫున చంద్రబాబు, మంత్రులు అనగాని, దుర్గేశ్, జనార్దన్ రెడ్డి, తెలంగాణ తరఫున భట్టి, శ్రీధర్ బాబు, పొన్నం పాల్గొన్నారు. సమావేశం ఫొటోలను పై గ్యాలరీలో చూడొచ్చు.
Similar News
News March 18, 2026
తెలంగాణలో రికార్డు స్థాయిలో గ్యాస్ డెలివరీలు

తెలంగాణలో మంగళవారం (మార్చి 17న) రికార్డు స్థాయిలో 2,35,678 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. ఇది సాధారణ సగటు సరఫరా (2.15 లక్షలు) కంటే ఎక్కువ. భారత్ పెట్రోలియం 57,635 (+22.63%), HP 84,156 (+11.98%), ఇండేన్ 93,887 (+1.00%) వృద్ధిని నమోదు చేశాయి. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, కొరత ఉందన్న వదంతులను నమ్మి ‘పానిక్ బుకింగ్’ చేయొద్దని పౌర సరఫరాల శాఖ విజ్ఞప్తి చేసింది.
News March 18, 2026
ICC ర్యాంకింగ్స్.. కోహ్లీ, రోహిత్ స్థానాలివే..

ICC ప్రకటించిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో NZ బ్యాటర్ మిచెల్ తొలి స్థానంలో నిలిచారు. భారత బ్యాటర్లు కోహ్లీ(2), రోహిత్(4), గిల్(5), రాహుల్ (9) టాప్-10లో ఉన్నారు. బౌలింగ్‌లో భారత్ నుంచి కుల్దీప్(8) ఒక్కరే టాప్-10లో నిలిచారు. ఆల్‌రౌండర్లలో అక్షర్ పదో స్థానంలో ఉన్నారు. అటు T20 బ్యాటింగ్‌లో అభిషేక్(1), ఇషాన్(2), తిలక్(6), సూర్య(9) టాప్-10లో ఉన్నారు. బౌలర్లలో వరుణ్ 2, బుమ్రా 5వ స్థానంలో నిలిచారు.
News March 18, 2026
కావ్యా.. కాల్ చెయ్: లలిత్ మోదీ

పాక్ బౌలర్ అబ్రార్‌ను సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన <<19366541>>వివాదం<<>>లోకి IPL ఫౌండర్ లలిత్ మోదీ ఎంటర్ అయ్యారు. ‘ఫ్యాన్స్ ఆవేశంలో ఉన్న సమయంలో ఒక పాక్ ప్లేయర్‌పై ₹2.34 కోట్లు ఇన్వెస్ట్ చేయడమా? ప్రజాభిప్రాయాన్ని ఎలా మేనేజ్ చేయాలో, సామ్రాజ్యాలను ఎలా నిర్మించాలో నాకు బాగా తెలుసు. నాకు కాల్ చెయ్’ అంటూ పరోక్షంగా SRH ఓనర్ కావ్యా మారన్‌ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు.


