News July 6, 2024
జింబాబ్వే చేతిలో భారత్ ఓటమి
జింబాబ్వేతో తొలి T20లో భారత్ 13 రన్స్ తేడాతో ఓడిపోయింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 102 రన్స్‌కే ఆలౌటైంది. కెప్టెన్ గిల్(31) రన్స్ చేయగా.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. అభిషేక్, రింకూ డకౌట్ కాగా.. అవేశ్ 16, బిష్ణోయ్ 9, రుతురాజ్ 7, జురెల్ 7, పరాగ్ 2 రన్స్ చేశారు. చివర్లో సుందర్ 27 రన్స్ చేసినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్‌లో జింబాబ్వే1-0తో ఆధిక్యం సాధించింది.
Similar News
News January 13, 2025
పెరుగుతున్న స్కార్లెట్ ఫీవర్ కేసులు
హైదరాబాద్‌లో కొద్దిరోజులుగా స్కార్లెట్ ఫీవర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 5-15 ఏళ్ల పిల్లలకు వ్యాపించే ఈ వైరస్‌తో ఆహారంపై అనాసక్తి, తీవ్రజ్వరం, నాలుక కందిపోవడం, నోట్లో పొక్కులు, గొంతులో మంట, నీరసం వంటి లక్షణాలుంటాయి. వీటితో పాటు 2-5 రోజుల్లో ఆయాసం, ముఖం వాపు, మూత్రం తగ్గడం, మూత్రంలో రక్తం గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.
News January 13, 2025
యూజీసీ నెట్ పరీక్ష వాయిదా
ఎల్లుండి(15న) జరగాల్సిన యూజీసీ నెట్ పరీక్షను NTA వాయిదా వేసింది. అభ్యర్థుల వినతి మేరకు సంక్రాంతి, పొంగల్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. కొత్త డేట్‌ను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. అటు 16న జరగాల్సిన ఎగ్జామ్ యథావిధిగా కొనసాగుతుందని చెప్పింది. కాగా యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హత పరీక్ష అయిన యూజీసీ నెట్ పరీక్షలు ఈనెల 3 నుంచి ప్రారంభమయ్యాయి.
News January 13, 2025
మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం కన్నుమూత
AP: రాజ్యసభ మాజీ సభ్యుడు, వైసీపీ సీనియర్ నేత పాలవలస రాజశేఖరం(78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. రాజశేఖరం ZP ఛైర్మన్‌గా, 1994లో ఉణుకూరు MLAగా(ఆ నియోజకవర్గం ఇప్పుడు రద్దయ్యింది), రాజ్యసభ ఎంపీగా సేవలు అందించారు. ఈయన కుమారుడు పాలవలస విక్రాంత్ YCP MLCగా ఉన్నారు. కూతురు రెడ్డి శాంతి పాత పట్నం మాజీ ఎమ్మెల్యే.