News July 6, 2024
సంగారెడ్డి: వనమహోత్సవ లక్ష్య సాధనకు కృషిచేయాలి: కలెక్టర్

జిల్లాలో వన మహోత్సవ లక్ష్యసాధనకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో 35.88 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ జ్యోతి, డీఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Similar News
News March 21, 2026
మెదక్: ఈసారీ నిరాశే !

రాష్ట్ర బడ్జెట్ మెదక్ జిల్లా ప్రజలను నిరాశ పరిచింది. మెతుకుసీమలో ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు ఘనపూర్ ఎత్తు పెంపు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే మిగిలింది. నూతనంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో జిల్లాలోని 1.68 లక్షల కుటుంబాలకు బీమా వర్తించనుంది. కాళేశ్వరం కెనాల్స్ పనులకు నిధులు లేవు, మెదక్ బైపాస్ రోడ్డు ప్రస్తావనేలేదు. బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News March 20, 2026
రంజాన్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం సోదరులందరూ శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకాంక్షించారు. రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, మత సామరస్యానికి ప్రతీక అని ఆమె పేర్కొన్నారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన ప్రతి ఒక్కరికీ ఈ పండుగ సుఖసంతోషాలను, ఆరోగ్యాన్ని చేకూర్చాలని ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
News March 20, 2026
విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు నిరాశాజనకం: టీపీటీఎఫ్

బడ్జెట్‌లో విద్యారంగానికి జరిగిన కేటాయింపులు నిరాశాజనకంగా ఉన్నాయని టీపీటీఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. యాదగిరి, పి. వెంకట్‌రామ్ రెడ్డి విమర్శించారు. మొత్తం 3,24,234 కోట్ల బడ్జెట్‌లో విద్యకు కేవలం 26,674 కోట్లు అంటే 8.22\% మాత్రమే కేటాయించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఈ నిధులు ఏమాత్రం సరిపోవని వారు పేర్కొన్నారు.


