News July 6, 2024

మారుమూల రాష్ట్రాల్లో ట్రేడింగ్‌పై పెరుగుతున్న ఆసక్తి!

image

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడికి మారుమూల రాష్ట్రాల ప్రజలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఏడాదిలో ఈశాన్య రాష్ట్రాలైన మిజోరంలో 81.10% (28,784 మంది క్లైంట్లు), అరుణాచల్ ప్రదేశ్ 62.19% (65,962), త్రిపుర 56.10% (2,52,038), నాగాలాండ్ 52.95% (68,385) వృద్ధి నమోదైంది. ఇక J&Kలో 53.79% (8,87,913), లద్దాక్‌లో 370.57% (1,887), పేద రాష్ట్రంగా గుర్తింపుపొందిన బిహార్‌లో 49.41% (71,97,665) వృద్ధి రికార్డ్ అయింది.

Similar News

News March 13, 2026

‘కుక్కపిల్లలా ట్రంప్’.. కాలిఫోర్నియా గవర్నర్ పోస్ట్ వైరల్

image

ట్రంప్‌పై కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయం చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. చమురు సంక్షోభం వేళ రష్యన్ ఆయిల్‌ను కొనేందుకు ట్రంప్ ప్రపంచ దేశాలకు APR 11 వరకు పర్మిషన్ ఇచ్చారు. దీంతో రష్యాకు భారీగా లబ్ధి చేకూరనుంది. ఈ క్రమంలో పుతిన్ ట్రంప్‌ను పెంపుడు కుక్కపిల్లలా కట్టేసి లాక్కెళ్తున్నట్లు ఉన్న ఎడిటెడ్ ఫొటోను గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేసింది. కాగా ట్రంప్ రిపబ్లికన్, గవర్నర్ న్యూసమ్ డెమోక్రటిక్.

News March 13, 2026

శుక్రవారం రోజున జన్మిస్తే..

image

శుక్రవారం నాడు జన్మించినవారిపై శుక్రుడి ప్రభావం ఉంటుందని జ్యోతిషులు చెబుతున్నారు. ‘వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, అపార సంపద గల యోగాన్ని కలిగి ఉంటారు. కష్టపడితే స్వయంకృషితోనే గొప్ప స్థాయికి చేరుకునే అదృష్టం ఉంటుంది. సినిమా, మీడియా రంగాల్లో రాణిస్తారు. 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారికి ఇంకా మంచి ఫలితాలుంటాయి. వీరు రాజరాజేశ్వరి దేవిని ఆరాధించాలి. లలితా సహస్రనామ పారాయణం చేయాలి’ అని సూచిస్తున్నారు.

News March 13, 2026

SMలో పోర్నోగ్రఫీకి పిల్లలు బలి.. హర్భజన్ ఆవేదన

image

సోషల్ మీడియా ప్రభావం చిన్నపిల్లలపై తీవ్రంగా పడుతోందని మాజీ క్రికెటర్, ఎంపీ హర్భజన్ సింగ్ రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు. అందులో విస్తృతంగా లభించే అసభ్యకర, పోర్నోగ్రఫీకి 12-13 ఏళ్ల పిల్లలు బలి అవుతున్నారని, వారి భవిష్యత్తు నాశనమవుతోందని పేర్కొన్నారు. యువతను సంరక్షించేందుకు వీలుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ వాడకంపై కఠిన ఆంక్షలు విధించాలని కేంద్రానికి సూచించారు.