News July 6, 2024
మంథని: చంద్రబాబును కలిసిన మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న చారిత్రాత్మిక సమావేశంలో మంథని ఎమ్మెల్యే, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు పాల్గొన్నారు.
Similar News
News February 20, 2026
KNR: ‘మ్యూజియంను అందుబాటులోకి తీసుకురావాలి’

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ స్కూల్ ఆవరణలోని జిల్లా సైన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజియంలో పునరుద్దరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. శుక్రవారం మ్యూజియం పనులను పర్యవేక్షించిన అనంతరం ఆమె మాట్లాడారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి మ్యూజియంను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
News February 20, 2026
KNR: ‘పదో తరగతి పరీక్షలు ముగిసే వరకు సెలవుల్లేవు’

వచ్చే నెల 14నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ సిబ్బందికి పరీక్షలు ముగిసే వరకు సెలవులు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ప్రతి వారం ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన పాఠశాలలను తప్పనిసరిగా సందర్శించి,100% ఉత్తీర్ణత సాధించేలా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.