News July 6, 2024
సికిందర్ రజా అరుదైన రికార్డు

జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించారు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా రెండో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు ఆయన 15 POTMలు అందుకున్నారు. ఈ క్రమంలో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ (15) రికార్డును ఆయన సమం చేశారు. కాగా అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ (16) ఉన్నారు.
Similar News
News March 21, 2026
IPLలో గ్రేటెస్ట్ టీమ్ ఇదే: పఠాన్

IPLలో ముంబై ఇండియన్స్ గ్రేటెస్ట్ టీమ్ అని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ‘ముంబై, చెన్నైలలో ఏదైనా ఒకటి ఎంచుకోవాలంటే కష్టమే. చెన్నై 2010లో, ముంబై 2013లో తొలిసారి టైటిల్స్ సాధించాయి. ఇరు జట్లు 5 సార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. కానీ టీమ్ ఇండియాకు మ్యాచ్ విన్నర్లను అందించడంలో ముంబై ముందు వరుసలో ఉంది. అందులో నలుగురు టీమ్ ఇండియా కెప్టెన్లు ఉన్నారు. అందుకే ముంబై అంటే నాకు గౌరవం’ అని తెలిపారు.
News March 21, 2026
గ్రీన్ 2 ఓవర్లే వేస్తే రూ.2 కోట్లు కట్ చేయాలి: అశ్విన్

KKR ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌పై మాజీ క్రికెటర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన 2 ఓవర్లే బౌలింగ్ వేస్తే ఫీజు నుంచి రూ.2 కోట్లు కట్ చేయాలి. 4 ఓవర్ల కోటా పూర్తి చేయకపోతే డబ్బును తగ్గించే హక్కు IPL ఫ్రాంచైజీలకు ఉండాలి’ అని అభిప్రాయపడ్డారు. IPLలో గ్రీన్ 4 ఓవర్లు వేయడానికి AUS అనుమతిస్తుందా? అనేది వేచి చూడాలన్నారు. కాగా గాయాలు కాకుండా ఉండేందుకు గ్రీన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా పరిమితులు విధించింది.
News March 21, 2026
ఏకంగా 20 కోతుల దాడి.. అక్కడికక్కడే మృతి

తెలుగు రాష్ట్రాల్లో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా కాకినాడ జిల్లాలో ఓ వృద్ధురాలి ప్రాణం తీశాయి. ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంకు చెందిన చిన్న బుల్లెమ్మ(65) గేదెకు నీరు పెడుతుండగా కోతులు గుంపులుగా వచ్చి ఆమెపై దాడి చేశాయి. ఏకంగా 20 కోతులు ఒకేసారి మీద పడటంతో తప్పించుకొనే అవకాశం లేకుండా పోయింది. తీవ్రగాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మరి మీ దగ్గరా కోతుల బెడద ఉందా? కామెంట్ చేయండి.


