News July 7, 2024

TODAY HEADLINES

image

* AP, TG సీఎంల భేటీ.. విభజన సమస్యలపై చర్చ!
* రాష్ట్రంలో చంద్రబాబు భయానక వాతావరణం సృష్టిస్తున్నారు: జగన్
* TGలో ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు టెట్
* తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేకే
* ఈనెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
* రూ.800 కోట్లు దాటిన ‘కల్కి 2898AD’ కలెక్షన్స్
* తొలి టీ20లో భారత్‌పై జింబాబ్వే విజయం
* ఇరాన్ అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియన్

Similar News

News October 14, 2024

నటి కారుకు యాక్సిడెంట్‌.. తీవ్ర గాయాలు

image

బుల్లితెర నటి శ్రీవాణి ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె నుదుటి మీద తీవ్ర గాయం కావడంతో పాటు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. ప్రస్తుతం గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె భర్త విక్రమాదిత్య వెల్లడించారు. 3రోజుల క్రితం కుటుంబంతో కలిసి చీరాల బీచ్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. శ్రీవాణి పలు సీరియల్స్‌, టీవీ షోల్లోనూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంటారు.

News October 14, 2024

కులగణనపై ఈనెల 24 నుంచి అభిప్రాయ సేకరణ

image

TG: కులగణనపై అభిప్రాయాలు సేకరించేందుకు ఉమ్మడి జిల్లాల్లో పర్యటించాలని బీసీ కమిషన్ నిర్ణయించింది. కులగణన కార్యాచరణపై ఇవాళ తొలిసారి సమావేశమైంది. ప్రణాళిక శాఖతో కలిసి కులగణన చేయాలని నిర్ణయించింది. ఈనెల 24 నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటించి, వివిధ వర్గాల అభిప్రాయాలను తీసుకోనుంది. వాటిని అధ్యయనం చేసిన అనంతరం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించనుంది.

News October 14, 2024

కెనడాలో దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించిన భారత్

image

కెన‌డాతో దౌత్యప‌ర‌మైన వివాదాలు ముదిరిన నేప‌థ్యంలో అక్క‌డి హైక‌మిష‌న‌ర్ స‌హా ఇత‌ర దౌత్య‌వేత్తల్ని భార‌త్ వెన‌క్కి పిలిపించింది. ఖ‌లిస్థానీ తీవ్ర‌వాది హ‌ర్దీప్ సింగ్ నిజ్జ‌ర్ హ‌త్య కేసులో కెనడా వీరిని అనుమానితుల జాబితాలో చేర్చ‌డంతో వివాదం చెల‌రేగింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వీరి భ‌ద్ర‌త విష‌యంలో కెన‌డా ప్ర‌భుత్వ నిబద్ధత‌పై త‌మ‌కు విశ్వాసం లేనందునా అందరినీ వెనక్కి పిలిపిస్తున్న‌ట్టు తెలిపింది.