News July 7, 2024
శ్రీకాకుళం: ‘YSR జయంతిని వేడుకగా జరపాలి’

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతిని ఈనెల 8న ఘనంగా నిర్వహించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రక్తదానం, స్కూల్లో పుస్తకాల పంపిణీ, మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైసీపీ కుటుంబ సభ్యులందరికీ పిలుపునిచ్చారు.
Similar News
News March 16, 2026
శ్రీకాకుళం జిల్లాకు నేడు వర్ష సూచన

అల్ప పీడన ద్రోణి, నైరుతి గాలుల ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. అకాల వర్షాలు కురిస్తే మామిడి, జీడీ మామిడి, అరటి, మొక్క జొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని జిల్లాలోని రైతులు దిగులు పడుతున్నారు. వర్షాలు, పిడుగులు పడిన సందర్భాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
News March 16, 2026
శ్రీకాకుళం: రెండు నెలల్లో.. ఐదు బ్యాంకు ఉద్యోగాలు..!

శ్రీకాకుళం జిల్లా గార మండలం జొన్నలపాడుకు చెందిన ఎం. స్వప్న అసాధారణ ప్రతిభతో ఆదర్శంగా నిలిచారు. వివాహం తర్వాత అత్తవారి ఇంట్లో ఉంటూనే పట్టుదలతో చదివి, కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఐదు బ్యాంకు ఉద్యోగాలను సొంతం చేసుకున్నారు. ఇందులో రెండు PO పోస్టులు, రెండు క్లర్క్ పోస్టులు, ఒక జూనియర్ అసోసియేట్ ఉద్యోగం ఉన్నాయి. విశాఖపట్నంకు చెందిన స్వప్న, తన విజయంతో మహిళల ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పారు.
News March 16, 2026
బూర్జ: టిప్పర్ ఢీకొని యువకుడి దుర్మరణం

టిప్పర్ ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి చెందిన ఘటన బూర్జ మండలంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. ఉప్పినివలస గ్రామానికి చెందిన జీవన్ కుమార్ (32) తన పనులను ముగించుకొని కొల్లివలస నుంచి స్వగ్రామానికి బైక్‌పై వస్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొని తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసు కేసు నమోదైంది.


