News July 7, 2024

ఎంపీ పురందీశ్వరిని కలిసిన తూ.గో. కలెక్టర్ ప్రశాంతి

image

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమండ్రి MP దగ్గుబాటి పురందీశ్వరిని స్థానిక జేఎన్ రోడ్డులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ది, పర్యటక పరంగా అభివృద్ధి, తదితర అంశాలపై వారు చర్చించారు.

Similar News

News January 13, 2026

కడియం నర్సరీలలో మొక్కలతో సంక్రాంతి శోభ

image

కడియం పల్ల వెంకన్న నర్సరీలో మంగళవారం సంక్రాంతి సందడి నెలకొంది. పండుగను పురస్కరించుకుని మొక్కలతో రూపొందించిన ప్రత్యేక ఆకృతులు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. భోగి మంట, పాలకుండ, గాలిపటం, ఎద్దు, కోడిపుంజు వంటి పండుగ ప్రతీకలను సృజనాత్మకంగా తీర్చిదిద్దారు. సంక్రాంతి శోభను ప్రతిబింబిస్తున్న ఈ మొక్కల కళాఖండాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

News January 12, 2026

ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు 16 ఫిర్యాదులు

image

తూ.గో జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 16 ఆర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ ప్రజల నుంచి స్వయంగా ఆర్జీలు స్వీకరించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులను చట్టపరిధిలో పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యమని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.

News January 12, 2026

తూ.గో: అన్నను రోకలిబండతో కొట్టి చంపిన తమ్ముడు

image

కుటుంబ కలహాలు నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. నిడదవోలు(M) అట్లపాడులో బండి కోట సత్యనారాయణ(28) అనే యువకుడు తన తమ్ముడు సాయిరాం చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం జరిగిన ఈ ఘటనలో సాయిరాం రోకలిబండతో అన్న తలపై బలంగా కొట్టడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి తల్లి దుర్గ భవాని ఉన్నారు. సమిశ్రగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం.