News July 7, 2024
కుటుంబ సభ్యులతో WC విజేతల సెలబ్రేషన్స్

టీ20 వరల్డ్ కప్ విజయాన్ని టీమ్ ఇండియా ఆటగాళ్లు తమ ఇళ్లల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యుజ్వేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీవర్మకు, జస్ప్రీత్ బుమ్రా తన తల్లి దల్జీత్ కౌర్‌కు, కుల్దీప్ యాదవ్ తన తల్లి ఉషా యాదవ్‌కు గోల్డ్ మెడల్స్ వేసి మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారాయి.
Similar News
News March 15, 2026
పుట్టా మహేశ్ డ్రగ్స్ వ్యవహారంపై చంద్రబాబు ఆగ్రహం

AP: TDP MP పుట్టా మహేశ్ డ్రగ్స్ వ్యవహారంపై CM చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఘటనపై వివరణ కోరుతూ మహేశ్‌కు నోటీసులు ఇవ్వాలని, పూర్తి నివేదిక తనకు సమర్పించాలని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు సూచించారు. డ్రగ్స్ కేసుల్లో ఎవరున్నా ఉపేక్షించేది లేదని CBN స్పష్టం చేశారు. నేతల బలహీనతలు, తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనని తేల్చిచెప్పారు.
News March 15, 2026
పెన్షన్ పెంపు, మహిళలకు రూ.2,500.. త్వరలో కీలక ప్రకటన!

TG: ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో పెండింగ్‌లో ఉన్నవాటి అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2,500, పెన్షన్ రూ.4,000కు పెంపు హామీలపై రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రకటన చేస్తారని విశ్వసనీయ సమాచారం. ఇక కొత్త సంక్షేమ పథకాలు, నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి అంశాలపైనా కీలక నిర్ణయాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
News March 15, 2026
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న RCB క్రికెటర్!

RCB కీలక బౌలర్ యశ్ దయాల్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 4న కంటెంట్ క్రియేటర్ శ్వేతా పుండీర్‌తో వివాహం జరిగినట్లు తాజాగా క్రీడా వర్గాలు తెలిపాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే అతడికి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు అతడిపై కేసు ఉన్న విషయం తెలిసిందే. రాజస్థాన్ హైకోర్టు యశ్‌కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది.


