News July 7, 2024
5-10 ఏళ్లలో ₹2.5లక్షల కోట్లకు జెప్టో ఆదాయం: CEO
2023 FYలో ₹2,000కోట్లుగా ఉన్న జెప్టో ఆదాయం ఏడాదిలోనే 5 రెట్లు పెరిగిందని ఆ కంపెనీ CEO ఆదిత్ పలిచా తెలిపారు. సరిగా వ్యాపారం చేస్తే ఇప్పుడున్న ₹10వేల కోట్ల ఆదాయాన్ని రాబోయే 5-10 ఏళ్లలో ₹2.5లక్షల కోట్లకు చేర్చగలమని పేర్కొన్నారు. ఆఫ్‌లైన్ రిటైల్ విభాగంలో ప్రస్తుతం టాప్‌లో ఉన్న డీమార్ట్‌ను తాము 18-24 నెలల్లో అధిగమించగలమని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో JIIF ఫౌండేషన్ డే ప్రొగ్రామ్‌లో ఆయన మాట్లాడారు.
Similar News
News January 16, 2025
‘తండేల్’ నుంచి రేపు మరో అప్డేట్
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ మూవీ నుంచి రేపు మరో అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు. మట్టికుండపై ఏదో వండుతున్నట్లుగా ఉన్న కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరో రుచికరమైనది రేపు ఉదయం 11.07 గంటలకు మీకు అందిస్తామని రాసుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
News January 16, 2025
కొత్త లుక్‌లో YS జగన్(PHOTO)
రెండో కుమార్తె వర్షారెడ్డి డిగ్రీ ప్రదానోత్సవం కోసం లండన్ వెళ్లిన AP మాజీ సీఎం వైఎస్ జగన్ కొత్త లుక్‌లో కనిపించారు. రెగ్యులర్‌గా సాధారణ డ్రెస్‌లో ఉండే ఆయన అక్కడ సూటును ధరించారు. జగన్‌తో పలువురు అభిమానులు దిగిన ఫొటోలను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాయి. కాగా ఈ నెలాఖరు వరకు ఆయన లండన్‌లో ఉండనున్నారు. తిరిగొచ్చిన తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్తారు.
News January 16, 2025
PHOTO: చంద్రబాబుతో నితీశ్ కుమార్ రెడ్డి
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా నితీశ్‌కు సీఎం రూ.25 లక్షల చెక్కును అందజేశారు. అంతర్జాతీయ గడ్డపై చరిత్ర సృష్టించి తెలుగువారు గర్వపడేలా చేశాడని చంద్రబాబు కొనియాడారు. భవిష్యత్తులో మరింత రాణించాలని ఆకాంక్షించారు. నితీశ్ వెంట ఆయన తండ్రితో పాటు ACA అధ్యక్షుడు ఉన్నారు.