News July 7, 2024

HYD: రూట్లతో 132 ఎకరాల్లో HMDA లేఅవుట్!

image

HYD శివారులో రూ.96 కోట్లతో లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు HMDA కసరత్తు మొదలుపెట్టింది. ఘట్‌కేసర్ మండల పరిధి ప్రతాపసింగారం గ్రామంలో ఒకే చోట 132 ఎకరాలను భూ యజమానులు HMDAకు అప్పగించారు. భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు సర్వే పూర్తి చేసి లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు అవసరమైన పనులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారు.

Similar News

News March 14, 2025

HYDలో ప్రప్రథమ శారీ డ్రాపింగ్ ఈవెంట్.. @మాంగళ్య షాపింగ్ మాల్

image

భారతీయ సంస్కృతికి చిహ్నం చీర కట్టు.. HYDలో ప్రప్రథమంగా మాంగళ్య షాపింగ్ మాల్ వారు శారీ డ్రాపింగ్ ఈవెంట్ నిర్వహించారు. వనస్థలిపురంలోని షాపింగ్ మాల్‌లో చెన్నైకి చెందిన ప్రముఖ శారీ డ్రాపర్ కవిత చీర కట్టు ఎలా ఉండాలనే అంశాలను వివరించారు. ఆసక్తిగా గమనించిన ఫ్యాషన్ డిజైనర్స్, బ్యూటీ పార్లర్ నిర్వాహకులు యాజమాన్యాన్ని అభినందించారు. ఛైర్మన్ కాసం నమశ్శివాయ, డైరెక్టర్లు పాల్గొన్నారు.

News March 14, 2025

HYD: హోలీ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత: సీపీ

image

35 ఏళ్ల తర్వాత ఒకే రోజు హోలీ, రంజాన్ మాసంలో రెండవ శుక్రవారం ఒకేరోజు రావడంతో HYD సీపీ సీవీ ఆనంద్ అధికారులను అప్రమత్తం చేశారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ప్రతీ జోన్, సున్నితమైన ప్రాంతాల్లో పికెట్‌లు ఏర్పాటు చేయాలని, అసాంఘిక శక్తులపై కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, డీసీపీ చైతన్య కుమార్ పాల్గొన్నారు.

News March 14, 2025

HYD: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

image

షాద్‌నగర్‌లో ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI

error: Content is protected !!