News July 7, 2024
హిమాచల్ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం

హిమాచల్ ప్రదేశ్‌ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ధర్మశాల, పాలాంపూర్ ప్రాంతాల్లో ఏకంగా 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల విద్యుత్, మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 150 రోడ్లను అధికారులు మూసేశారు. పర్యాటకులు ప్రస్తుతానికి రాష్ట్రానికి రావొద్దని సూచించారు. అత్యవసర సహాయక చర్యల బలగాలను కేంద్రం సిద్ధంగా ఉంచింది.
Similar News
News March 11, 2026
గ్యాస్ బుకింగ్ సిస్టమ్ క్రాష్!

సాధారణం కంటే 8-10 రెట్లు ఎక్కువగా ఫోన్ కాల్స్ రావడంతో ఇండేన్ గ్యాస్ బుకింగ్ సిస్టమ్ కుప్పకూలినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో ఇండేన్‌కు 15 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి. చాలామంది వినియోగదారులు IVRS మిస్డ్ కాల్ ద్వారానే గ్యాస్ బుకింగ్ చేస్తుంటారు. దేశంలో LPG కొరత ఏర్పడిందని తెలిసి బుకింగ్‌కు పోటెత్తడంతో ఇండేన్ బుకింగ్ సిస్టమ్ క్రాష్ అయింది. మరి మీకు ఇండేన్ గ్యాస్ బుక్ అవుతోందా? COMMENT
News March 11, 2026
ఎక్కడా గ్యాస్ కొరత లేదు: చంద్రబాబు

AP: స్కూళ్లు, ఆస్పత్రులకు అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా జరగాలని CM చంద్రబాబు సూచించారు. ‘ప్రస్తుతం కొరత లేదు. కేంద్రంతో మాట్లాడి ఇబ్బందులు రాకుండా చూడాలి. గుడ్లు, అరటి లాంటి ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతకాలి. సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా నిఘా పెట్టాలి’ అని కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. గ్యాస్, ఉద్యాన ఉత్పత్తుల మార్కెట్ పరిస్థితుల అంచనాకు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు.
News March 11, 2026
అకౌంట్లలోకి డబ్బులు.. ఇలా చేయండి

ఎల్లుండి(ఈ నెల 13న) రైతుల <<19350621>>ఖాతాల్లో<<>> పీఎం కిసాన్ డబ్బులు జమ కానున్నాయి. అయితే అర్హులైన అన్నదాతలు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు. పీఎం కిసాన్ <


