News July 7, 2024

HYD: అక్రమ నల్లా కనెక్షన్లకు యాప్ ద్వారా CHECK

image

HYDలో తాగు, మురుగు నీటి అక్రమ కనెక్షన్లకు చెక్ పెట్టేందుకు జలమండలి సిద్ధమైంది. ఇప్పటికే కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలిలో నూతన యాప్ ద్వారా ఇన్‌స్పెక్షన్ మొదలుపెట్టారు. ఆయా ప్రాంతానికి వెళ్లి యాప్‌లో చెక్ చేస్తే అనుమతి పొందిన కనెక్షన్ల వివరాలు చూపిస్తుంది. యాప్‌లో చూపించని కనెక్షన్లు అక్రమం అని తేలిపోనుంది. అక్రమ కనెక్షన్ల ద్వారా జలమండలికి తీవ్ర నష్టం జరుగుతోందని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Similar News

News March 8, 2026

HYD: ‘కార్యేషు దాసి’.. ‘అర్ధాంగి’కి నిలువెత్తు రూపాలు..!

image

ఆ అన్నదమ్ములను విధి పక్షవాతం రూపంలో వెంటాడింది. ఘట్‌కేసర్‌ అంకుషాపూర్‌కు చెందిన బత్తుల కిష్టమ్మ కుమారులు భిక్షపతి(51), శ్రీరాములు(43) 16 ఏళ్లుగా పక్షవాతంతో పోరాడుతూ మంచానికే పరిమితయ్యారు. కాగా, వీరి భార్యలు భవానీ, సంధ్య భర్తలకు కన్నతల్లిలా సేవలు చేసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ‘కార్యేషు దాసి’ అన్న ఆర్యోక్తిని వీరు నిజం చేసి చూపిస్తున్నారు. అర్ధాంగులు అన్న అర్థానికి జీవం పోస్తున్నారు.

News March 8, 2026

HYD: ఆడవాళ్లు మీకు జోహార్లు

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లోని విజయాలు స్ఫూర్తినిస్తున్నాయి. ఐటీ, అంతరిక్ష పరిశోధనల నుంచి స్టార్టప్‌ల వరకు హైదరాబాద్ మహిళలు ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతున్నారు. మహిళలు లఖ్‌పతీ దీదీలుగా ఎదిగి ఆర్థిక సాధికారతను చాటుతున్నారు. క్రీడల్లో మెడల్స్ సాధించి దేశ ప్రతిష్టను పెంచారు. పాలనలోనూ కలెక్టర్లు, డీసీపీలుగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ మహిళా శక్తిని నిరూపిస్తున్నారు.