News July 7, 2024
సిద్దిపేట: PM కిసాన్ పేరుతో వచ్చే లింక్ ఓపెన్ చేయొద్దు: APO

వాట్సాప్‌లో PM కిసాన్ పేరుతో వచ్చిన లింక్ కలకలం సృష్టిస్తోంది. హుస్నాబాద్ ఉపాధి హామీ APOపద్మ వాట్సాప్‌లో నుంచి PM కిసాన్ 1.0 ENAPK పేరుతో గ్రూపుల్లో పోస్టు వచ్చింది. కొందరు వెంటనే APOకు కాల్ చేయగా తన ఫోన్ హ్యాక్ అయిందని, లింక్ క్లిక్ చేయొద్దని చెప్పారు. 2రోజుల క్రితం వాట్సాప్‌కు వచ్చిన ఈ లింక్ ఓపెన్ చేయగా ఫోన్ హ్యాక్ చేశారు. తనకు తెలియకుండానే గ్రూప్, నంబర్లకు లింక్ వెళ్తుందన్నారు.
Similar News
News March 3, 2026
మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ హోలీ శుభాకాంక్షలు

హోలీ పండుగను పురస్కరించుకుని మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రతిమా సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఏకం చేసే ఈ రంగుల పండుగ, ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషపు వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు. ప్రకృతి సిద్ధమైన రంగులను మాత్రమే వినియోగిస్తూ, సంప్రదాయబద్ధంగా వేడుకలను జరుపుకోవాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ హితవు పలికారు. ఆనందోత్సాహాల మధ్య పండుగను ఆస్వాదించాలని ఆమె కోరారు.
News March 2, 2026
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి: కలెక్టర్

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కలెక్టర్ ప్రతిమ సింగ్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ప్లాన్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన ‘బాల్య వివాహ ముక్త భారత్’ ప్రచార గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. జిల్లాను బాల్య వివాహ రహితంగా మార్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమాజంలో ఈ దురాచారంపై విస్తృత అవగాహన కల్పించాలని కోరారు
News March 2, 2026
MDK: ప్రశాంతంగా, కుటుంబ సమేతంగా హోలీ జరుపుకోవాలి: ఎస్పీ

హోలీ పండగ సందర్భంగా మెదక్ జిల్లా ప్రజలకు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, చెరువులు–కుంటాల వద్ద ప్రమాదాలకు గురికావద్దని హెచ్చరించారు. మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని సూచించారు. అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పిల్లలపై తల్లిదండ్రులు పర్యవేక్షణ వహించాలని తెలిపారు.


