News July 7, 2024
ఖమ్మం: ఫోన్ ధర డబ్బులు చెల్లించాల్సిందే!

భద్రాద్రి జిల్లా రామవరానికి చెందిన మహబూబ్ అలీ 2022లో ఆన్‌లైన్‌లో సెల్‌ఫోన్ రూ.18,298 చెల్లించి బుక్ చేసుకున్నాడు. ఆర్డర్ రాగా దానిని ఓపెన్ చేస్తే చార్జర్, పౌచ్ మాత్రమే ఉండటంతో ఆన్లైన్ కంపెనీకి ఫోన్ చేశాడు. వారి నుంచి స్పందన రాకపోవడంతో జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు నివేదించాడు. పరిశీలించిన కమిషన్ కంపెనీ నిర్లక్ష్యం ఉందని నిర్ధారించి ఫోన్ ధర చెల్లించాలని తీర్పునిచ్చారు.
Similar News
News July 6, 2025
ఖమ్మం: కవిత పర్యటనకు బీఆర్ఎస్ నేతలు డుమ్మా.. కారణమిదేనా?

ఖమ్మం జిల్లాలో ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటన హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పర్యటనలో పార్టీ కీలక నేతలు పువ్వాడ అజయ్, కందాల, సండ్ర, వద్దిరాజు రవిచంద్ర, తాత మధు ఎక్కడా కనిపించలేదు. బీఆర్ఎస్‌లో తనకు కేసీఆర్ తప్పా మరో లీడర్ లేరని కవిత చేసిన కామెంట్స్ వల్లే ఆపార్టీ నేతలంతా దూరంగా ఉన్నారనేది టాక్. ఆమె పర్యటనలో జిల్లా నేతలు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
News July 6, 2025
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 6.8 మి.మీ వర్షపాతం నమోదు

ఖమ్మం జిల్లాలో శనివారం ఉదయం 8:30 నుంచి ఆదివారం ఉదయం 8:30 వరకు 6.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. రఘునాథపాలెం మండలంలో 1.0, ఏన్కూరు మండలంలో 5.8 మిల్లీమీటర్లు నమోదైనట్లు చెప్పారు. ఈ రెండు మండలాలు మినహా గడిచిన 24 గంటల్లో ఇతర మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.
News July 6, 2025
ఖమ్మం డీసీసీబీ బంగారు తాకట్టు రుణాలాలో టాప్

ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బంగారు తాకట్టు రుణాల మంజూరులో రాష్ట్రంలో ప్రథమ స్థాయిలో నిలిచింది. 57,519 మంది దాదాపు రూ.765 కోట్ల మేర బంగారు ఆభరణాల తాకట్టుపై రుణాలు తీసుకున్నారు. మరో వారంలోగా ఇది రూ.800 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందని ఉద్యోగులు, పాలకవర్గ సభ్యులు అనందం వ్యక్తం చేశారు.