News July 7, 2024
రాజాం: మంట పుట్టిస్తున్న మిర్చీ ధరలు

రాజాం కూరగాయల మార్కెట్లో గత నెల కిలో రూ.30 ఉన్న మిర్చిని ప్రస్తుతం రూ.100కు చేరింది. ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు మిరపకు తెగుళ్లు సోకి మిరప పంటలు పాడైపోవడంతో దిగుమతి తగ్గింది. ఒకేసారి భారీగా ధరలు పెరిగిపోవడంతో వినియోగదారులకు మిరప మరింత ఘాటెక్కింది. ఇదిలా ఉండగా మిరప సాగు చేసే రైతులు నష్టాల్లో చిక్కుకుని అప్పుల పాలవతున్నామని వాపోయారు.
Similar News
News March 11, 2026
SKLM: ‘ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలి’

ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ కెవి రమణ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం తండేవలసలో ఉన్న పోలీస్ శిక్షణకేంద్రంలో ఆర్మడు రిజర్వుడ్ పోలీసులకు 14 రోజులుపాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని వ్యక్తిగత క్రమశిక్షణ పాటిస్తూ జిల్లా పోలీసుశాఖ ప్రతిష్ఠను పెంచాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు.
News March 10, 2026
శ్రీకాకుళం: ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం.. చివరికీ

శ్రీకాకుళం జిల్లాతో పాటు, పలు ప్రాంతాల్లో బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా బీబీనగర్‌కు చెందిన గొల్ల బెనర్జీ పలు చోట్ల ఉద్యోగాల పేరుతో రూ.1.05 కోట్లు వసూలు చేశాడన్నారు. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశామన్నారు.
News March 10, 2026
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌పై ACB అదికారుల దాడి

శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో ACB అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ACB సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రావుతో కూడిన బృందం ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్ సంబంధించిన ఫైళ్లను, ఈ ఆఫీస్ ఫైళ్లను పరిశీలించారు. టౌన్ ప్లానింగ్ శాఖలో అవినీతి ఆరోపణలు పెరిగిన నేపథ్యంలో ఏసీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫిర్యాదుల మేరకు సోదాలు నిర్వహిస్తున్నారు.


