News July 7, 2024
HYD: రూ.100 కోసం హత్య

వ్యక్తిని రాయితో కొట్టి హత్య చేసిన ఘటన మేడ్చల్ PS పరిధిలో జరిగింది. పోలీసులు వివరాలు.. వెంకట్రామిరెడ్డి నగర్ కాలనీకి చెందిన పోచయ్య(45)వద్ద మధ్యప్రదేశ్‌కి చెందిన ధర్మేంద్ర పని చేస్తున్నాడు. అతడికి పోచయ్య రూ.100 ఇవ్వాల్సి ఉండగా అడిగాడు. పోచయ్య డబ్బులు ఇవ్వకపోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తుమ్మ చెరువు సమీపంలో లేబర్ అడ్డా వద్ద పోచయ్యను ధర్మేంద్ర రాయితో కొట్టి హత్య చేశాడు. కేసు నమోదైంది.
Similar News
News January 26, 2026
HYD: డక్కన్‌ను ఏలిన ధీరవనిత

<<18954194>>రుద్రమదేవి..<<>>దక్షిణ భారత సింహాసనాన్ని అధిరోహించిన తొలి ధీరవనిత. కాకతీయ వంశంలో కాంతులు చిందించిన మహారాణి. దేవగిరి రాజు మహాదేవుడి దండయాత్రలను ధైర్యసాహసాలతో తిప్పికొట్టిన ధైర్యశాలి. నాయంకర వ్యవస్థను అమలు చేసి చరిత్రలో నిలిచారు. గొలుసుకట్టు చెరువులకు ఆజ్యం పోసి నీటిని ఒడిసిపట్టేలా చేశారు. ఓరుగల్లు కోటకు మెరుగులద్దారు. 8పదుల వయసులో కదన రంగంలోకి దిగి కాయస్త అంబదేవుడితో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు.
News January 26, 2026
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర వేడుకలు వైభవంగా నిర్వహించారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్ణన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని మేయర్ ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి పలువురు వికలాంగులకు పరికరాలను అందజేశారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News January 26, 2026
మువ్వన్నెల శోభతో బల్కంపేట ఎల్లమ్మ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ గర్భగుడిని తీవర్ణపతాక రంగులతో అలకరించారు. వివిధ రకాల పుష్పాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. అమ్మవారి ఈ అపూర్వ రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.


