News July 7, 2024

గుజరాత్‌లో BJPని ఓడిస్తాం.. రాస్కోండి: రాహుల్ గాంధీ

image

అయోధ్య తరహాలోనే గుజరాత్‌లోనూ బీజేపీని ఓడించి తీరుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ‘గుజరాత్‌లో మోదీని, బీజేపీని కాంగ్రెస్ ఓడిస్తుంది. కావాలంటే రాసి పెట్టుకోండి. ఇక్కడి నుంచే కాంగ్రెస్ కొత్త శకాన్ని మొదలుపెడుతుంది. గుజరాత్ వజ్రాల పరిశ్రమ కష్టాలే తెలుసుకోలేని మనిషి, రాష్ట్ర ప్రజలకు మాత్రం ఏం చేస్తారు?’ అని ప్రశ్నించారు.

Similar News

News March 16, 2026

భారత్‌కు ఆయిల్ తేవడమే టార్గెట్.. యుద్ధంలోనూ తగ్గేదేలే!

image

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్నా భారతీయ నౌకలు క్రూడ్‌తో దేశానికి సేఫ్‌గా తిరిగొస్తున్నాయి. తాజాగా జగ్ లాడ్కి అనే నౌక సాహసోపేతంగా వార్ జోన్‌ను దాటేసింది. UAEలోని ఫుజైరా పోర్టుపై శనివారం దాడి జరిగినప్పుడు ఈ నౌక చమురు నింపుకుంటోంది. అయినా 80,800 టన్నుల ముర్బాన్ క్రూడ్ లోడ్ చేసుకొని నిన్న తిరుగుప్రయాణమైంది. కాగా 92,712 టన్నుల LPGతో శివాలిక్, నందాదేవి అనే నౌకలు కూడా భారత్‌ చేరుకోనున్నాయి.

News March 16, 2026

ఫిల్మ్ ఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలు ఎక్కువ: MLA అనిరుధ్

image

TG: డ్రగ్స్ మూలాలు సినీ పరిశ్రమలోనే ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ MLA అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘యాక్టర్లు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటేనే సినిమాలు రిలీజ్ చేయాలి. టెస్టుకు నిరాకరిస్తే విడుదలను ఆపేయాలి’ అని అన్నారు. ప్రజాప్రతినిధులూ 90 రోజులకోసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని, లేదంటే చట్ట సభలోకి అనుమతించొద్దని పేర్కొన్నారు. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసు నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

News March 16, 2026

హార్ముజ్‌పై ఆశలు.. మార్కెట్లకు లాభాల జోష్

image

గత మూడు సెషన్లలో భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లకు ఈరోజు భారీ లాభాలు ఊరటనిచ్చాయి. సెన్సెక్స్ 938 పాయింట్ల లాభంతో 75,502 వద్ద క్లోజ్ అవగా నిఫ్టీ 257 పాయింట్ల లాభంతో 23,408 వద్ద స్థిరపడింది. కొనుగోళ్లు పెరగడం, క్రూడ్ లోడ్‌తో భారతీయ నౌకలు వస్తుండటం, హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న ఇతర నౌకలను ఎస్కార్ట్ చేసేందుకు US ప్లాన్ చేస్తున్నట్లు రిపోర్ట్స్ రావడం మార్కెట్లకు రిలీఫ్‌ను ఇచ్చింది.