News July 7, 2024
VZM: మంత్రి శ్రీనివాస్‌కు డిజిటల్ అసిస్టెంట్స్ వినతి

ఉమ్మడి జిల్లాలోని సచివాలయాల్లో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్స్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు శనివారం వినతిపత్రం సమర్పించారు. డిజిటల్ అసిస్టెంట్ల ఉన్నత విద్యార్హతలు, జాబ్ చార్ట్‌లో లోపాలు మంత్రికి తెలియజేశారు. వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్‌గా నియమించాలని కోరారు. డిజిటల్ అసిస్టెంట్స్‌ని స్కూల్స్‌లో కంప్యూటర్ టీచర్ లేదా జూనియర్ అసిస్టెంట్‌గా మార్చాలన్నారు.
Similar News
News March 10, 2026
విజయనగరం: గుండెపోటుతో ఆరోగ్యమిత్ర మృతి

విజయనగరంలో ఆరోగ్యమిత్రాగా పనిచేస్తున్న చింతల మహేశ్ (36) మంగళవారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. కొత్తవలస గ్రామానికి చెందిన ఈయన గత 15 ఏళ్లుగా ఆరోగ్యశ్రీ పథకంలో సేవలందిస్తున్నారు. మహేశ్ మరణంతో ఆయనపైనే ఆధారపడిన తల్లి, చెల్లి దిక్కులేనివారయ్యారు. ఆరోగ్యశ్రీ సిబ్బంది మహేశ్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి అండగా ఉండాలని కోరారు.
News March 10, 2026
VZM: గిరిజన మహిళలకు గుడ్ న్యూస్

జిల్లాలో గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం SCA పథకం అమలు చేస్తోందని గిరిజన సాధికారిత అధికారి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ పథకం కింద 54 ఉపాధి యూనిట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రూ. 1.62 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నామని, ఒక్కో లబ్ధిదారునికి రూ. 50 వేల సబ్సిడీతో పాటు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామని ఆయన వివరించారు.
News March 10, 2026
నాటు తుపాకుల నియంత్రణకు ‘కార్డన్ సెర్చ్’: ఎస్పీ

జిల్లాలో నాటు తుపాకులు, పేలుడు పదార్థాల నియంత్రణకు గుర్తించిన గ్రామాల్లో ‘కార్డన్ సెర్చ్’ నిర్వహించాలని SP ఎ.ఆర్. దామోదర్ అధికారులను మంగళవారం ఆదేశించారు. లైసెన్స్ లేకుండా ఆయుధాలు కలిగి ఉండటం నేరమని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరి వద్దనైనా నాటు తుపాకులు లభ్యమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ ఆయుధాల సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలని కోరారు.


