News July 7, 2024

వైసీపీలో నియోజకవర్గ ఇన్‌ఛార్జుల మార్పులు!

image

AP: ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మార్పులు మొదలైనట్లు సమాచారం. పెనమలూరు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి జోగి రమేశ్‌ను సొంత సెగ్మెంట్ మైలవరానికి మార్చినట్లు తెలుస్తోంది. కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవభక్తుని చక్రవర్తిని పెనమలూరు ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మిగిలిన నియోజకవర్గాల్లోనూ మార్పులపై కసరత్తు జరుగుతోందని పేర్కొన్నాయి.

Similar News

News March 3, 2026

హార్ముజ్‌లో నిలిచిపోయిన 700+ నౌకలు

image

హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో ఆ మార్గంలో ఇరువైపులా 700+ నౌకలు నిలిచిపోయాయి. వీటిల్లో 334 క్రూడ్ ఆయిల్, 263 శుద్ధి చేసిన, 109 శుద్ధి చేయని చమురు తదితర ట్యాంకులున్నాయి. మార్చి 1వ తేదీనే ఈ మార్గంలో రాకపోకలకు భయపడి కేవలం 3 ట్యాంకర్లతో 2.8M బ్యారెల్స్ చమురునే నౌకలు తరలించాయి. సాధారణ రాకపోకలకు పోలిస్తే ఇది 86% తగ్గినట్లే. నిన్న ఓ చిన్న ట్యాంకర్, కార్గో షిప్ మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించాయి.

News March 3, 2026

ఇరాన్ ప్లాస్టిక్ డ్రోన్ల సంచలనం!

image

సౌదీలోని ‘అరామ్‌కో’ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ షాహెద్-136 <<19277309>>డ్రోన్లతో<<>> దాడి చేసింది. అమెరికా టెక్నాలజీతో డెవలప్ చేసిన ఈ డ్రోన్లు ప్లాస్టిక్, కార్బన్ ఫైబర్‌తో రూపొందాయి. ఇవి భూమికి 50 అడుగుల ఎత్తులోనే ప్రయాణిస్తాయి. లోహాన్ని మాత్రమే గుర్తించే US రాడార్లకు ఇవి చిక్కకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ ఆయుధం జియోపాలిటిక్స్‌లో అమెరికా ఆధిపత్యానికి సవాలు విసురుతోంది.

News March 3, 2026

టాటా మెమోరియల్ సెంటర్‌లో 40 పోస్టులు

image

<>ముంబైలోని <<>>టాటా మెమోరియల్ సెంటర్ 40 మెడికల్, నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ, BE/BTech, ME/MTech, MD/DNB/DM, BSc(MIT), MSc(AI, డేటా సైన్స్), డిప్లొమా, GNM అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/PET, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://tmc.gov.in