News July 7, 2024

నేడు పలు జిల్లాల్లో భారీ వర్షం: వాతావరణ కేంద్రం

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల బాపట్ల, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, మన్యం, పార్వతీపురం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. ఇక మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.

Similar News

News March 12, 2026

ప్యాడ్స్ వాడితే దద్దుర్లు వస్తున్నాయా?

image

పీరియడ్స్‌లో అమ్మాయిలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ప్యాడ్స్ వాడటం వల్ల దద్దుర్లు, దురద వేధిస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే కాటన్ ప్యాడ్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సెంటెడ్ ప్లాస్టిక్ పూత ఉన్న ప్యాడ్స్ వల్ల గాలి ప్రసరణ జరగక సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే 4-6 గంటలకు ఓ సారి ప్యాడ్ మార్చాలి. మైల్డ్ సబ్బు, గోరువెచ్చని నీటితో వెజినాని క్లీన్ చేయడం వల్ల కూడా సమస్య అదుపులో ఉంటుంది.

News March 12, 2026

మారిన వాతావరణం.. వరికి దోమపోటు ముప్పు!

image

మారిన వాతావరణ పరిస్థితుల వల్ల వరిలో దోమపోటు ఆశించడానికి అవకాశం ఉంటుంది. వరి దుబ్బుకు పిలక దశలో 10-15 దోమలు, ఈనిక దశలో 20-25 దోమలను గమనిస్తే వాటి కట్టడికి చర్యలు తీసుకోవాలి. అలాగే నత్రజని ఎరువులను నిపుణులు సలహా మేరకు పరిమితంగా వాడాలి. దోమ పోటు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో పైమెట్రోజైన్ 120గ్రా. లేదా డైనోటెఫ్యూరాన్ 80గ్రా. లేదా ట్రైఫ్లూమెజోపైరం 96ml కలిపి మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి.

News March 12, 2026

‘జాబ్ క్యాలెండర్’పై రేపు కీలక భేటీ

image

AP: ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆయా శాఖలవారీగా ఖాళీల వివరాలను ఆర్థిక శాఖ సేకరించింది. రేపు అన్ని విభాగాధిపతులతో కీలక భేటీ నిర్వహించనుంది. ఆ తర్వాత ఖాళీలపై తుది జాబితాను రూపొందించనున్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారం ఫేక్ అని కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.