News July 7, 2024

త్వరలో ‘ప్యాకేజ్డ్ ఫుడ్’పై పెద్ద అక్షరాల్లో పోషకాల సమాచారం!

image

ప్యాకేజ్డ్ ఫుడ్ వస్తువులపై పోషక సమాచారాన్ని పెద్ద అక్షరాలతో ముద్రించాలనే నిబంధనలను FSSAI తీసుకురానుంది. ఉప్పు, చక్కెర, కొవ్వు తదితర పదార్థాలు ఎంత మొత్తంలో ఉన్నాయనే వివరాలను పెద్దగా, బోల్డ్ ఫాంట్‌లో ఉంచాలని ప్రతిపాదించింది. దీనిపై ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసి వివిధ వర్గాల స్పందన కోరనుంది. ఇది అమల్లోకి వస్తే ఉత్పత్తుల్లోని పోషకాల గురించి యూజర్లు మెరుగ్గా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.

Similar News

News April 4, 2026

ధురంధర్: హీరోయిన్ కోసం 1,200 మందికి ఆడిషన్!

image

‘ధురంధర్’ మూవీలో హీరోయిన్‌గా సారా అర్జున్‌ను ఎంపిక చేయడానికి గల కారణాన్ని క్యాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ ఛబ్రా తాజాగా వెల్లడించారు. ‘రణ్‌వీర్‌తో నటించాలని అనుకుంటున్నట్లు చాలామంది ఆదిత్య ధర్, నాకు మెసేజ్‌లు పంపారు. అయితే అక్కడి(పాక్‌) వ్యక్తిలా కనిపించే, కొత్త ముఖం కావాలని భావించాం. ఇప్పటికే రణ్‌వీర్‌తో నటించిన వాళ్లు సరిపోరు. 1,200-1,300 మందికి ఆడిషన్ చేసి చివరికి సారాను ఎంపిక చేశాం’ అని తెలిపారు.

News April 4, 2026

ఇరాన్ నుంచి స్థిరంగా ఆయిల్ సరఫరా: ఇండియా

image

పశ్చిమాసియాలో అంతరాయాలు ఎదురవుతున్నప్పటికీ దేశీయ రిఫైనరీలు స్థిరంగా క్రూడాయిల్ పొందుతున్నాయని పెట్రోలియం శాఖ తెలిపింది. ఇరాన్ సహా పలు దేశాల నుంచి సరఫరా కొనసాగుతోందని ట్వీట్ చేసింది. దిగుమతులకు సంబంధించి చెల్లింపులకు అడ్డంకి లేదని స్పష్టం చేసింది. పేమెంట్ సమస్యల వల్ల ఇండియాకు రావాల్సిన ఆయిల్ ట్యాంకర్ చైనాకు వెళ్లిందన్న వార్తలను ఖండించింది. నౌకలు కొన్నిసార్లు గమ్యస్థానాలను మార్చుకుంటాయంది.

News April 4, 2026

ఆలయాల వద్ద రాజకీయ కార్యకలాపాలపై నిషేధం: CM

image

TTD తరహాలో తెలంగాణలోని ఆలయాల వద్ద రాజకీయ కార్యకలాపాలను నిషేధించాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. ఆలయాల పవిత్రతకు భంగం కలగకుండా రూల్స్ కఠినం చేయాలన్నారు. ₹225CRతో బాసర ఆలయ అభివృద్ధి ప్రణాళికను CM సమీక్షించారు. ‘భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్ర ప్రకారం అభివృద్ధి చేయాలి. విశాలమైన రోడ్లు ఉండాలి. EVలను వినియోగించాలి’ అని సూచించారు. ఈనెల 6న ఈ పనులకు CM శంకుస్థాపన చేస్తారు.