News July 7, 2024
ఉమ్మడి జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో పత్తి పంట సాగు

ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటివరకు పత్తి పంట ఒక్కటే అత్యధిక విస్తీర్ణంలో సాగైంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తొలినాళ్లలోనే పత్తి పంట సాగుకు రైతులు ఉపక్రమించారు. జూన్ మాసాంతానికి ఖమ్మం జిల్లాలో 1,81,723 ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 1,88,263 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఈపంట సాగైందని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Similar News
News March 10, 2026
ఖమ్మం: ఇంటర్ పరీక్షలో విద్యార్థిపై మాల్‌ప్రాక్టీస్ కేసు

ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడిన ఓ విద్యార్థిపై మాల్‌ప్రాక్టీస్ కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలోని ఓ కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు డీఐఈఓ రవిబాబు వెల్లడించారు. సోమవారం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షకు 17,849 మంది హాజరుకాగా, 502 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
News March 10, 2026
ఖమ్మం: చెక్కు బౌన్స్.. నిందితుడికి జైలు శిక్ష

చెక్కు బౌన్స్ కేసులో శ్రీరాంనగర్‌కు చెందిన జి.విద్యాసాగర్‌కు ఖమ్మం కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. 2017లో బానోత్ శరత్ వద్ద తీసుకున్న రూ.2 లక్షల అప్పు కోసం విద్యాసాగర్ ఇచ్చిన చెక్కు తిరస్కరణకు గురైంది. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయాధికారి బెక్కమ్ రజని నిందితుడికి 3 నెలల జైలు శిక్షతో పాటు, బాధితుడికి రూ.2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సోమవారం తీర్పునిచ్చారు.
News March 10, 2026
ఖమ్మంలో తెల్లవారుజామున కవిత అరెస్టు

ఖమ్మం వెలుగుమట్ల భూ నిర్వాసితుల పక్షాన నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ఖమ్మం అంబేడ్కర్ భవన్ వద్ద డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్‌తో కలిసి ఆమె దీక్షకు దిగారు. పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని హైదరాబాద్ వైపు తరలించారు. పోలీసులకు, బాధితులకు మధ్య తోపులాట జరగడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.


