News July 7, 2024

‘దేవర’తో జాన్వీ ఆటాపాటా

image

కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే వారం ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణకు మూవీ యూనిట్ ప్లాన్ చేసిందట. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో సెట్‌ను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ఇటీవల థాయ్‌లాండ్‌లో ఓ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Similar News

News January 17, 2025

TODAY HEADLINES

image

✒ 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
✒ సైఫ్ అలీ ఖాన్‌పై దుండగుడు కత్తితో దాడి
✒ పెన్&పేపర్ పద్ధతిలో NEET UG పరీక్ష
✒ ISRO.. SpaDeX విజయవంతం
✒ AP: నితీశ్‌కు రూ.25 లక్షల చెక్ ఇచ్చిన సీఎం
✒ 2047కి తలసరి ఆదాయం రూ.58.14L: CBN
✒ జూదాన్ని రాష్ట్ర క్రీడగా మార్చేశారు: YSRCP
✒ TG: నా నిజాయితీని నిరూపించుకుంటా: KTR
✒ TG: FEB 15 నుంచి బీసీ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్

News January 17, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ అదనంగా 220+ షోలు

image

విక్టరీ వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పబ్లిక్ డిమాండ్ మేరకు ఏపీ, టీజీలో అదనంగా 220కి పైగా షోలు వేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఇప్పటికే రెండు రోజుల్లో రూ.77 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా అతిత్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు.

News January 17, 2025

ఎవరీ సితాంశు?

image

52 ఏళ్ల సితాంశు కొటక్ 1992-2013 మధ్య కాలంలో సౌరాష్ట్ర తరఫున దేశవాళీ క్రికెట్ ఆడారు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 41.76 సగటుతో 8,061 పరుగులు చేశారు. ఇందులో 15 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆయన ప్రతిభను గుర్తించి ఇండియా-ఏ హెడ్ కోచ్‌గా బీసీసీఐ గుర్తించింది. కొటక్ హయాంలో గత నాలుగేళ్లలో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో IND-A సత్తా చాటింది.