News July 7, 2024
ఇసుక ప్రైవేటుగా విక్రయిస్తే చర్యలు: జిల్లా అధికారి

పల్నాడు జిల్లాలో సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం చేపడుతున్నట్లు గనులు భూగర్భ శాఖ జిల్లా అధికారి నాగిని తెలిపారు. నరసరావుపేటలోని జిల్లా కార్యాలయంలో ఆమె శనివారం మాట్లాడుతూ.. కృష్ణానది సమీప యార్డుల్లో నిల్వ చేసిన ఇసుక టన్ను రూ.191.52గా ఉన్నతాధికారులు నిర్ణయించారన్నారు. అయితే ఎక్కడైనా ఇసుక ప్రైవేటుగా విక్రయించినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News March 10, 2026
గుంటూరు: మరి కాసేపట్లో ముగియనున్న గడువు

గుంటూరు జిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణకు మరికొన్ని గంటలే మిగిలాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో 25% సీట్లు పేద విద్యార్థులకు కేటాయిస్తున్నారు. అర్హులైన తల్లిదండ్రులు మంగళవారం వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వార్షిక ఆదాయం రూ.1.44 లక్షల్లోపు ఉండాలి. ఎంపిక కోసం లాటరీ విధానం అమలు చేస్తారు. ఎంపికైన వారు మార్చి 26 నుంచి ఏప్రిల్ 7 వరకు ప్రవేశాలను నిర్ధారించాలి.
News March 10, 2026
గుంటూరు ‘పుర’ అధికారుల నియామకం

గుంటూరు జిల్లాలో పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో GMCకు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా, తెనాలికి గుంటూరు JC అశుతోష్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. మార్చి 17న ప్రస్తుత పాలకవర్గం బాధ్యతల నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో కొత్త పాలకవర్గం కొలువు తీరే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది.
News March 10, 2026
వేసవి కార్యాచరణకు సిద్ధం: GNT కలెక్టర్

రానున్న వేసవి దృష్ట్యా ముందస్తు చర్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గుంటూరు జిల్లాలో వేసవి కార్యాచరణకు తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఈ సందర్భంగా తెలిపారు. తాగునీటి సరఫరా, వైద్యం, అగ్నిమాపక సేవలపై రెవెన్యూ, మున్సిపల్, ఆరోగ్య శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు వివరించారు.


