News July 7, 2024

ఆరోగ్య బీమాపై GSTని 5 శాతానికి తగ్గించాలని వినతులు

image

ఆరోగ్య బీమా పాలసీలపై ప్రస్తుతం 18% ఉన్న GSTని 5 శాతానికి తగ్గించాలని కేంద్రాన్ని బీమా ఏజెంట్లు, పాలసీదారులు కోరుతున్నారు. 2047కి ప్రతి ఒక్కరికీ బీమా అందించాలనే IRDAI లక్ష్యం నెరవేరడానికి ఇదే మార్గమంటున్నారు. అలాగే ప్రస్తుతం సెక్షన్ 80D కింద వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలకు ₹25వేల వరకే మినహాయింపు ఉందని, దీన్ని ₹50వేల వరకు పెంచాలంటున్నారు. కొత్త బడ్జెట్‌లో వీటి ప్రస్తావన చేయాలని విన్నవిస్తున్నారు.

Similar News

News November 13, 2025

రూ.30 కోట్లతో మినీ వేలంలోకి CSK?

image

IPL-2026 మినీ వేలానికి ముందు CSK రిటెన్షన్స్‌పై మరికొన్ని అప్‌డేట్స్ బయటికొచ్చాయి. రచిన్ రవీంద్ర, కాన్వేతో పాటు చాలా మంది స్వదేశీ ప్లేయర్లను రిలీజ్ చేయాలని ఆ టీమ్ నిర్ణయించుకున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఫారిన్ ప్లేయర్లు మతీశా పతిరణ, నాథన్ ఎల్లిస్‌ను రిటైన్ చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి. దాదాపు రూ.30 కోట్ల పర్స్‌తో CSK వేలంలో పాల్గొననున్నట్లు సమాచారం.

News November 13, 2025

వరల్డ్ లాంగెస్ట్ మ్యారీడ్ కపుల్ వీరే..

image

అత్యధిక కాలంగా దాంపత్య జీవితం సాగిస్తున్న జంటగా అమెరికాకు చెందిన ఎలీనర్(107), లైల్ గిట్టెన్స్(108) ప్రపంచ రికార్డ్ సృష్టించారు. 1942లో వీరికి వివాహం కాగా 83ఏళ్లుగా అన్యోన్యంగా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈక్రమంలోనే ఓల్డెస్ట్ లివింగ్ కపుల్‌గానూ ఖ్యాతి గడించారు. వీరి కంటే ముందు బ్రెజిల్‌ జంట మనోయల్, మరియా అత్యధిక కాలం(85ఏళ్లు) వైవాహిక జీవితం గడిపిన కపుల్‌గా రికార్డుల్లోకెక్కారు.

News November 13, 2025

షమీని ఎందుకు తీసుకోవట్లేదు? గిల్ సమాధానమిదే

image

షమీ లాంటి బౌలర్లు చాలా తక్కువ మంది ఉంటారని IND టెస్ట్ కెప్టెన్ గిల్ అన్నారు. ఆయన్ను ఎందుకు సెలక్ట్ చేయలేదు, ఫ్యూచర్‌లో చేస్తారా అనే ప్రశ్నలకు తనకంటే సెలక్టర్లే బెటర్‌గా సమాధానం ఇవ్వగలరని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతమున్న బౌలర్లు చాలా బాగా రాణిస్తున్నారని గుర్తుచేశారు. SAతో జరగనున్న తొలి టెస్టులో ఆల్‌రౌండర్ లేదా ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను ఆడించే విషయంపై రేపే నిర్ణయం తీసుకుంటామన్నారు.