News July 7, 2024
అమరావతిలో ORR విశేషాలు ఇలా.!

ఉమ్మడి గుంటూరు జిల్లా CRDA పరిధిలో 189 KM పొడవున ORR నిర్మాణం జరగనుంది. 150 మీటర్ల వెడల్పుతో 2 వైపులా సర్వీస్ రోడ్లు కాకుండా 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో నిర్మాణం పూర్తయితే కంచికచర్ల, వీరులపాడు, జి.కొండూరు, మైలవరం, ఆగిరిపల్లి, బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, తోట్లవల్లూరు కలిపి 10 మండలాల్లోని 49 గ్రామాల మీదుగా ORR వెళ్తుంది.
Similar News
News September 15, 2025
కృష్ణా: 13 మంది ఎంపీడీఓలకు పదోన్నతి

కృష్ణా జిల్లాలో నలుగురు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, 9 మంది డిప్యూటీ ఎంపీడీఓలకు ఎంపీడీఓలుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన వారికి జడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక పోస్టింగ్ ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ కన్నమ నాయుడు పాల్గొన్నారు.
News September 15, 2025
కృష్ణా: నేడు బాధ్యతలు స్వీకరించనున్న నూతన SP

కృష్ణా జిల్లా ఎస్పీగా నియమితులైన విద్యాసాగర్ నాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11:30 గంటలకు ఆయన జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని పదవీ బాధ్యతలు చేపడతారు. ఇటీవల జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న విద్యాసాగర్ నాయుడును కృష్ణా జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
News September 15, 2025
MTM: ఎస్పీ గంగాధరరావుకు ఘన వీడ్కోలు

కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసి బదిలీపై వెళ్తున్న ఆర్. గంగాధరరావు ఐపీఎస్‌కు పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. మచిలీపట్నం గోల్డ్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఎస్పీతో తమ అనుభవాలను పంచుకున్నారు. తమకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి గంగాధరరావు కృతజ్ఞతలు తెలిపారు.