News July 7, 2024
భూమివైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పరిమాణంలో ఉండే భారీ గ్రహ శకలం భూమివైపు దూసుకొస్తోంది. రేపు ఇది భూమికి అతి సమీపంగా రానున్నట్లు నాసా తెలిపింది. గంటకు 65,215 కి.మీ వేగంతో భూమి వైపునకు దూసుకొస్తున్నట్లు వెల్లడించింది. 260 ఫీట్ల వ్యాసం కలిగిన ఈ శకలం గమనాన్ని సైంటిస్టులు గమనిస్తున్నారు. ఇది 15 లక్షల కి.మీ దూరంలో భూమిని దాటి వెళ్తుందని, ప్రమాదం లేదని సైంటిస్టులు చెబుతున్నారు.
Similar News
News March 4, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 4, 2026
TODAY HEADLINES

☛ చంద్రబాబు-పవన్ భేటీ.. జల్ జీవన్ మిషన్, హనుమాన్ ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చ
☛ ఫేస్ రికగ్నిషన్‌తోనే ఇకపై పథకాలు: CM రేవంత్
☛ చంద్రగ్రహణం.. ఎర్రని రంగులో కనువిందు చేసిన చంద్రుడు
☛ కేంద్ర మాజీ మంత్రి ఉన్నికృష్ణన్ కన్నుమూత
☛ ఇరాన్ అణు కేంద్రం ధ్వంసం: IAEA
☛ యుద్ధ ప్రభావం.. ఇరాన్‌లో 787 మంది మృతి
News March 4, 2026
పాక్‌ను సామంత రాజ్యంగా మార్చే కుట్ర: ఖవాజా ఆసిఫ్

ఇరాన్‌పై జరుగుతున్న దాడుల వెనుక జియోనిజం(ఇజ్రాయెల్ జాతీయవాదం) ప్లాన్ ఉందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ విమర్శించారు. తమ దేశ సరిహద్దుల వరకు ఇజ్రాయెల్ ప్రాబల్యాన్ని విస్తరించాలని ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. పాక్‌ను సామంత రాజ్యంగా మార్చే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఇందులో అఫ్గాన్, ఇండియాకు భాగముందన్నారు. తమ అణుశక్తిని ప్రపంచం గుర్తించిందని, దేశాన్ని కాపాడేందుకు సైన్యం రెడీగా ఉందని చెప్పారు.


