News July 7, 2024

ఆదిలాబాద్: పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

image

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో PG వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. జులై 7 వరకు గడువు ఉండగా ఈనెల 12 వరకు పొడగించినట్లు తెలిపారు. మీసేవ, TG ఆన్‌లైన్ సెంటర్‌లోనే ఫీజు చెల్లించాలన్నారు. PG రెండో సంవత్సర పరీక్షలు జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు, PG మొదటి సంవత్సరం పరీక్షలు ఆగస్టు 9 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Similar News

News March 22, 2026

రైతుల కోసం టెలీ-మానస్ హెల్ప్ లైన్ : ADB కలెక్టర్

image

మానసిక ఒత్తిడితో బాధపడుతున్న రైతులు, వారి కుటుంబసభ్యులు ప్రభుత్వం అందిస్తున్న టెలీ-మానస్ (Tele-MANAS) హెల్ప్‌లైన్ 14416 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఈ నంబర్‌కు కాల్ చేసి నిపుణులైన కౌన్సిలర్ల ద్వారా ఉచిత సలహాలు పొందవచ్చని తెలిపారు. గ్రామ స్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఈ సేవలపై అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. రైతులు మానసిక ఒత్తిడికి గురికావద్దన్నారు.

News March 21, 2026

నార్నూర్: రూ.2,40,000 విలువగల గంజాయి స్వాధీనం

image

నార్నూర్ మండలంలోని మాలేపూర్‌లో సాగు చేస్తున్న గంజాయి తోటపై శనివారం పోలీసులు దాడి చేశారు. సీఐ ప్రసాద్, SI శ్రీసాయి వివరాల ప్రకారం.. మాలేపూర్‌కు చెందిన బాలాజీ తన వ్యవసాయంలో గంజాయి సాగు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మొత్తం 24 మొక్కలు స్వాధీనం చేశారు. దాని విలువ రూ.2,40,000 ఉంటుందని అంచనా వేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 21, 2026

వారికి ఆదిలాబాద్ కలెక్టర్ హెచ్చరిక..!

image

ప్రభుత్వం రాయితీపై గృహ అవసరాలకు అందిస్తున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించడం చట్టరీత్యా నేరమని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో అక్రమ గ్యాస్ వినియోగాన్ని అరికట్టేందుకు విజిలెన్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయన్నారు.