News July 7, 2024
భీమవరంలో ప్రపంచ చాక్లెట్ దినోత్సవం

భీమవరం గునుపూడిలోని బాలికల హాస్టల్‌లో ప్రపంచ చాక్లెట్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా RRDS ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు అమూల్యరావు మాట్లాడుతూ.. చాక్లెట్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్ట పడతారని అన్నారు. చాక్లెట్ రుచుల్లో మొత్తం 600 రకాలున్నాయని అన్నారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు పంచిపెట్టారు.
☛ ఇంతకీ మీకు ఏ చాక్లెట్ ఇష్టం..?
Similar News
News March 31, 2026
భీమవరం: బడ్జెట్ కేటాయింపులపై చర్చ

భీమవరం కలెక్టరేట్‌లో ‘బడ్జెట్ ఔట్‌రీచ్’ సమీక్షలో 2026-27 రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. జిల్లాలో ప్రధానమైన వ్యవసాయం, ఆక్వా రంగాలతో పాటు ఇతర రంగాల విస్తరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా సూచించారు. బడ్జెట్ ప్రయోజనాలను ప్రజలకు చేరవేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
News March 31, 2026
ఉండి: ఆస్తి తగదా.. బంధువుపై కత్తితో దాడి

ఆస్తి తగాదాలతో ఉండికి చెందిన శేషాద్రి శ్రీనివాస్‌పై ఆయన బంధువు కత్తితో దాడి చేశారు. సోమవారం రాత్రి ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలైన శ్రీనివాస్ భీమవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉండి ఎస్సై నసీరుల్లా కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. కుటుంబ కలహాలే దాడికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
News March 31, 2026
తణుకు జాతీయ రహదారిపై యాక్సిడెంట్

తణుకు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పడింది. తాడేపల్లిగూడెం నుంచి తణుకు వైపు ఫ్రూట్స్ లోడుతో వస్తున్న ఆటో తేతలి వై జంక్షన్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న డ్రైవర్ క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరిపించుకున్నారు. ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి.


