News July 7, 2024
అన్నమయ్య: పాలకోవ కోసం వెళ్లి.. ప్రాణాలు పోగొట్టుకున్నారు

చిత్తూరు – కర్నూల్ ఎన్‌హెచ్‌పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. కడపకు చెందిన ఐదుగురు రాత్రి కారులో గువ్వలచెరువులో పాలకోవ తినడానికి వెళ్లారు. తినేసి వస్తున్న సమయంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి మండిపల్లి సొంత నిధుల నుంచి రూ.లక్ష తక్షణ సాయం కింద అందించారు.
Similar News
News March 17, 2026
సిద్దవటం: భర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు

సిద్దవటం మండలంలోని కపర్దేశ్వర స్వామి కోన వద్ద 2014లో జరిగిన హత్య కేసులో నలుగురు ముద్దాయిలకు కోర్టు జీవిత ఖైదు విధించింది. భర్తను హత్య చేసి బంగారు నగలు దోచుకున్న కేసులో భార్యతో పాటు మరో ముగ్గురిపై నేరం రుజువవడంతో కడప కోర్టు ఒక్కొక్కరికి జీవిత ఖైదు, రూ.2000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.
News March 17, 2026
అవినీతి ఆరోపణలపై కడప కార్పొరేషన్ ఇంజినీర్ల పెన్షన్లలో కోత

కడప మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజినీరింగ్ విభాగంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ముగ్గురు రిటైడ్ ఇంజినీర్ల పెన్షన్లలో కోత విధిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ACB ఫిర్యాదుపై విచారణ జరిపిన ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ఇంజినీర్లు శ్రీనివాసులు, దస్తగిరి రెడ్డి, దౌలాకు వారి పెన్షన్లో 5 శాతం కోత విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పనులను విభజించి, నామినేషన్‌పై కట్టబెట్టడంపై చర్యలు తీసుకున్నారు.
News March 17, 2026
జిల్లాలో పలువురు డిప్యూటీ ఎమ్మార్వోలకు తాత్కాలిక పదోన్నతులు

కడప జిల్లాలో పలువురు డిప్యూటీ ఎమ్మార్వోలకు తాత్కాలిక పదోన్నతులు కల్పించి బదిలీ చేస్తూ సోమవారం కలెక్టర్ శ్రీధర్ ఉత్తర్వులు ఇచ్చారు. వారి పోస్టింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.
➤ శివలక్ష్మి – నందలూరు, ➤ విజయకుమారి – చెన్నూరు
➤ లక్ష్మీనారాయణ – కడప అర్బన్, ➤ లక్ష్మమ్మ – టి సుండుపల్లె
➤ షఫీ – మైలవరం, మనోజ్ – బి.కోడూరుకు తహసీల్దార్లుగా బదిలీ పదోన్నతులు కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు.


