News July 7, 2024

ఆషాఢమాస బోనాలు (PHOTO GALLERY)

image

ఆషాఢమాస బోనాలు హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గోల్కొండ జగదాంబిక మహంకాళీ అమ్మవారికి భక్తులు పెద్దసంఖ్యలో బోనాలు సమర్పిస్తున్నారు. జోగినిలు ప్రత్యేకంగా అలంకరించిన బోనం కుండలలో అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్తున్నారు. బ్యాండుమేళాలు, పోతురాజుల విన్యాసాలతో భాగ్యనగరంలో సందడి నెలకొంది.

Similar News

News October 15, 2024

హీరో దర్శన్‌కు మరోసారి చుక్కెదురు

image

కన్నడ హీరో దర్శన్‌కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు సెషన్స్ కోర్టు కొట్టివేసింది. కాగా దర్శన్‌ను బళ్లారి జైలు నుంచి బెంగళూరు జైలుకు తరలిస్తారని వార్తలు వస్తున్నాయి. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, బెంగళూరులో చికిత్స అందించాలని దర్శన్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు తెలుస్తోంది.

News October 15, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 15, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4:57 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:09 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:02 గంటలకు
అసర్: సాయంత్రం 4:17 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:54 గంటలకు
ఇష: రాత్రి 7.07 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 15, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.