News July 7, 2024

హైదరాబాద్‌లో దిగిన ‘భారతీయుడు2’ టీమ్

image

‘భారతీయుడు2’ టీమ్ హైదరాబాద్‌లో ల్యాండయింది. Nకన్వెన్షన్ సెంటర్‌లో కాసేపట్లో ప్రారంభమయ్యే ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పాల్గొని సందడి చేయనుంది. కమల్ హాసన్ లీడ్ రోల్‌లో డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సిద్ధార్థ్, కాజల్, రకుల్ ప్రీత్‌సింగ్, SJ సూర్య కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. దాదాపు రూ.350కోట్ల బడ్జెట్‌తో దీన్ని రూపొందించారు.

Similar News

News March 23, 2026

కీలక బిల్లు: విద్వేష ప్రసంగాలు చేస్తే 7 ఏళ్ల జైలు

image

TG: విద్వేష ప్రసంగాలు చేసేవారి భరతం పట్టేలా కీలక బిల్లును GOVT ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇలాంటి ప్రసంగాలు చేస్తే తొలిసారి ₹50000 జరిమానా, 7 ఏళ్ల జైలు విధిస్తారు. రెండోసారి కూడా చేస్తే ₹1 లక్ష జరిమానా, 10 ఏళ్లు జైలు తప్పదు. ఇప్పటికే ఇలాంటి చట్టం కర్ణాటకలో ఉంది. కాగా పేరెంట్స్‌ను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల వేతనం నుంచి 10-15% కట్ చేసి వారికి అందించేలా మరో బిల్లునూ త్వరలో పెట్టనున్నారు.

News March 23, 2026

అఫిడవిట్ ఉంటేనే సాదాబైనామా రిజిస్ట్రేషన్లు!

image

TG: సాదాబైనామా రిజిస్ట్రేషన్లకు రెవెన్యూశాఖ కొత్త రూల్స్‌ను GOVTకి ప్రతిపాదించింది. ఇకపై వీటి రిజిస్ట్రేషన్‌కు అఫిడవిట్లను తప్పనిసరి చేయడం వంటి రూల్సు రానున్నాయి. రాష్ట్రంలో దాదాపు 9.50 లక్షల సాదాబైనామా రిజిస్ట్రేషన్లకు దరఖాస్తులు రాగా అందులో 20వేలు మాత్రమే పరిష్కారమయ్యాయి. న్యాయపరమైన చిక్కులతో మిగతావి పెండింగ్‌లో పడ్డాయి. కొత్త రూల్స్‌ వస్తే అఫిడవిట్ ఉంటేనే సాదాబైనామా రిజిస్ట్రేషన్ అవుతుంది.

News March 23, 2026

అసలైన ‘ధురంధర్’.. రవీంద్ర కౌశిక్(1/2)

image

‘ధురంధర్-2’ హిట్టైన నేపథ్యంలో రియల్ లైఫ్ ‘ధురంధర్’ రవీంద్ర కౌశిక్ గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఈయన కేవలం 23 ఏళ్ల వయసులోనే RAW ఏజెంట్‌గా ఎంపికై.. ‘నబీ అహ్మద్ షకీర్’ పేరుతో పాకిస్థాన్‌కు వెళ్లారు. అక్కడ LLB పూర్తిచేసి పాక్ సైన్యంలో ఉద్యోగం పొంది మేజర్ స్థాయికి ఎదిగారు. 1979-1983మధ్య పాక్ సైన్యంలోని రహస్యాలు, అణ్వాయుధ కార్యక్రమ సమాచారాన్ని భారత్‌కు చేరవేసేవారు.